Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపు

Published

on

బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని మే 16

పెద్దపల్లి జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు మద్దతుగా శనివారం పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12.40 లక్షల మెడికల్ షాపులు, ఫార్మసీలు బంద్‌లో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందుల విక్రయాలు జరగడం, డాక్టర్ చీటీ లేకుండానే మందులు అందించడం, కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారులను నష్టపరచడం, కల్తీ ఔషధాల నియంత్రణలో వైఫల్యం వంటి సమస్యలపై ఈ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె. రాజేందర్, కోశాధికారి పోలు సతీష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లోని సుమారు 650 మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిట్టల శ్రీనివాస్, ఎన్. కరుణాకర్ రెడ్డి, విష్ణుమూర్తి, కోటగిరి వాసు, సంతోష్, అశోక్, మార్గాచారి, రాజేందర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణే ధ్యేయం

Published

on

బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున బస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించి, కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నిర్మూలన సాధ్యమని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.

అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలనీల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 20 మంది పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

News

ఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్

Published

on

ఎండపల్లి, మే 15 (బిబిఎంఎ న్యూస్

(రాష్ట్ర రహదారి 7)పై వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ప్రాణనష్టంపై బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొమ్ము రాంబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఇటీవల అంబరిపేట, రాయపట్నం ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఈ రహదారి “మరణశాల”గా మారుతోందని అన్నారు. ఈ ప్రమాదాల్లో పేదలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు, పలువురు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెరిగిన వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రాజీవ్ రహదారి 7ను తక్షణమే ఫోర్‌లేన్‌గా విస్తరించాలని, ప్రమాదాల నివారణకు రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలమయంగా మారిన రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.

ఇటీవల రాయపట్నం వద్ద జరిగిన ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, పుష్కరాల నాటికి రవాణా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర రహదారి– 7 పై డివైడర్ల ఏర్పాటు, ఫోర్‌లేన్ విస్తరణ పనులు ప్రారంభించకపోతే ప్రజల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కొమ్ము రాంబాబు హెచ్చరించారు.

Continue Reading

Andhra

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ

Published

on

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ

బిబిఎం ఏ న్యూస్ / విశాఖపట్నం

విశాఖపట్నంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నగర పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ప్రజలకు అందుబాటులో ఉంచిన 7995095799 నంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి, విశాఖ రైల్వే స్టేషన్ 8వ ప్లాట్‌ఫాం సమీపంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన సీపీ రైల్వే పోలీసులను అప్రమత్తం చేయగా, వారు ఘటనాస్థలికి చేరుకొని ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని క్షణాల్లో రక్షించారు. అనంతరం బాధితుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఫోన్ చేసిన వెంటనే స్పందించి తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు కాపాడినందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గారికి బాధితుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Continue Reading

Trending