crime
అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)
అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.
2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
crime
లైసెన్సు లేని బేకరీకి రూ.10 వేల జరిమానా.. నాసిరకం ఆహార విక్రయాలపై రూ.75 వేల ఫైన్
భూపాలపల్లి /బిబిఏంఏ న్యూస్/జులై 30: గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టారు. లైసెన్సు లేకుండా బేకరీ నిర్వహిస్తున్న నిర్వాహకుడికి రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే వేరుశెనగలు, శనగపప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ తదితర నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పలు దుకాణాలు, రిలయన్స్ స్టోర్‌తో పాటు కొన్ని రెస్టారెంట్లపై మొత్తం రూ.75 వేల జరిమానా విధించారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్సు పొందాలని, నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలనే ప్రజలకు అందించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
End
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
crime
రూ.60 వేల లంచం కేసులో ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ, ఏఈ ఏసీబీ వలలో
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు.
సోనాల్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజాసేవకులు లంచం కోరితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News6 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
-
News3 weeks agoరామగుండం కార్పొరేషన్లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య
