crime
అతివేగం బలి.. మహబూబ్‌నగర్‌లో ఐదుగురు మృతి
యువకుల బైక్ రేసింగ్ సరదా.. ఐదుగురి ప్రాణాలు బలి
మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అతివేగం, బైక్ రేసింగ్‌లే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం.. స్పోర్ట్స్ బైక్ సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక బైపాస్ రోడ్డు బైక్ రేసింగ్‌లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
crime
లైసెన్సు లేని బేకరీకి రూ.10 వేల జరిమానా.. నాసిరకం ఆహార విక్రయాలపై రూ.75 వేల ఫైన్
భూపాలపల్లి /బిబిఏంఏ న్యూస్/జులై 30: గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టారు. లైసెన్సు లేకుండా బేకరీ నిర్వహిస్తున్న నిర్వాహకుడికి రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే వేరుశెనగలు, శనగపప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ తదితర నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పలు దుకాణాలు, రిలయన్స్ స్టోర్‌తో పాటు కొన్ని రెస్టారెంట్లపై మొత్తం రూ.75 వేల జరిమానా విధించారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్సు పొందాలని, నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలనే ప్రజలకు అందించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
End
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
crime
రూ.60 వేల లంచం కేసులో ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ, ఏఈ ఏసీబీ వలలో
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు.
సోనాల్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజాసేవకులు లంచం కోరితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment4 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News5 days agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News1 week agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
