Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

రాజాపూర్ భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

Published

on

రాజాపూర్ భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

రామగిరి, బిబిఎంఏ న్యూస్, మే 08:

ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2 విస్తరణలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోతున్న రాజాపూర్ గ్రామ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య కలిసి గ్రామ ప్రజల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఎస్సారెస్పీ కాలువ సమీప భూములకు తగిన నష్టపరిహారం, టెంపరరీ నెంబర్ల ఇండ్లకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. సింగరేణి బ్లాస్టింగ్‌ల కారణంగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాల జారీ నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్ ఆర్డీవో, తహసీల్దార్, ఆర్జీ-3 జీఎంను సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

యామనపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

Published

on

బిబిఎంఏ న్యూస్ /మహాముత్తారం

జయశంకర్ బుపాలపల్లి జిల్లా మహాముత్తారంమండలంలోని యామనపల్లి గ్రామంలో వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండ్రీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఫార్మ్ వీక్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, లేగదూడలకు డీవార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సేవలు అందించారు. రైతులకు సబ్సిడీపై గడ్డి గింజలు పంపిణీ చేసి, వేసవికాలంలో పశువుల సంరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అట్టేం రమేష్, వెటర్నరీ డాక్టర్ కే భరత్ బాబు, లైవ్ స్టాక్ అసిస్టెంట్ కే కార్తీక, సిబ్బంది జి శ్రీనివాస్, గోపాలమిత్ర జి పోశయ్య, వాసుమిత్ర రమేష్ సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

తలసేమియా పై అవగాహనతోనే నివారణ సాధ్యం: వైద్యాధికారి దీప్తి

Published

on

బిబిఎంఎ న్యూస్/ మహాముత్తరం 08: అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మెడికల్ ఆఫీసర్ దీప్తి మాట్లాడుతూ తలసేమియా అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన అలసట, లేత చర్మం, శారీరక ఎదుగుదల లోపం వంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ముందస్తుగా పరీక్షలు చేయించుకుని అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, హెచ్‌ఏ రవీందర్, ఫార్మసిస్ట్ భాగ్యలక్ష్మి, డీఈఓ సుమన్, స్టాఫ్ నర్స్ సుధ, నందనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పీఎంజే చోరీతో కరీంనగర్‌లో రాజకీయ రగడa

Published

on

పీఎంజే జ్యువెలర్స్ ఘటనతో కరీంనగర్‌లో రాజకీయ తుపాన్

గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి.. పాడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం

బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణల యుద్ధం.. భారీగా మోహరించిన పోలీసులు

బిబిఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం / కరీంనగర్:

కరీంనగర్‌లో పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటన రాజకీయ రంగు పులుముకుని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండగా గురువారం పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కొందరు కార్యాలయంపై దాడికి దిగినట్లు సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెందిన వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాహనం అద్దాలు పగులగొట్టడంతో పాటు ఇతర భాగాలను కూడా ధ్వంసం చేశారు. కార్యాలయం వద్ద ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్యాంపు కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో రాజకీయ దాడులు తగవని విమర్శించారు. మరోవైపు బీజేపీ నాయకులు తమ నిరసనను అణచివేసే ప్రయత్నాల వల్లే ఉద్రిక్తత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.

పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటనతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ చిచ్చుగా మారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Continue Reading

Trending