Police News
BBMA POLICE E:NEWS// ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ వేదిక – నంద్యాల కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ
BBMA POLICE E:NEWS// ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ వేదిక – నంద్యాల కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ
నంద్యాల, ఏప్రిల్ 13: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మరియు జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి అర్జీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పరిపాలన సాగాలని అధికారులు పేర్కొన్నారు.
News
నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదించిన సైబరాబాద్ పోలీసులు.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్, సీసీఎస్ నార్సింగి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నకిలీ భారత కరెన్సీ, నకిలీ అమెరికన్ డాలర్లు, కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కెమికల్ మెటీరియల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నమ్మించి, నకిలీ నోట్లను రెట్టింపు చేస్తామని, కెమికల్స్‌తో కరెన్సీని తయారు చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మోసంలో భాగంగా నకిలీ నోట్లు, రసాయనాలను ఉపయోగించి బాధితులను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల హెచ్చరిక మేరకు ప్రజలు “డబ్బును రెట్టింపు చేస్తాం”, “కెమికల్స్‌తో కరెన్సీ తయారు చేస్తాం” వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
News
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. సీపీ
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. నా•ణ్యమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని ఆదేశం
మంచిర్యాల, బీబీఎంఏ న్యూస్, జూలై 24: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, ప్రజలపై అనవసర బలప్రయోగానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
ప్రతి పోలీసు అధికారి సీసీటీఎన్‌ఎస్, ఐటీ, ఆధునిక పోలీసింగ్ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించి చట్టపరిధిలో న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra4 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
