Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE E:NEWS// ఫేక్ ట్రేడింగ్ కాల్ సెంటర్ బస్టింగ్ – సైబర్ మోసం వెలుగులోకి

Published

on

BBMA POLICE E:NEWS// ఫేక్ ట్రేడింగ్ కాల్ సెంటర్ బస్టింగ్ – సైబర్ మోసం వెలుగులోకి

BBMA POLICE E:NEWS// ఫేక్ ట్రేడింగ్ కాల్ సెంటర్ బస్టింగ్ – సైబర్ మోసం వెలుగులోకి

Hyderabad City Police పరిధిలోని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని బట్టబయలు చేశారు. నాగోల్‌కు చెందిన 35 ఏళ్ల అధ్యాపకుడిని “Barclays” పేరుతో నడిచిన నకిలీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మోసం చేసి, ₹36.30 లక్షలు దోచుకున్నారు.

మోసగాళ్లు భారీ లాభాలు చూపిస్తూ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి, 45 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, రౌటర్లు, ట్యాబ్స్, 40 ATM కార్డులు, 20 SIM కార్డులు, చెక్‌బుక్స్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లపై నమ్మకం పెట్టుకునే ముందు ధృవీకరించుకోవాలి. అనుమానం వచ్చిన వెంటనే 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

News

భద్రాచలంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. లాడ్జీలు, బస్టాండ్ ప్రాంతాల్లో డీఎస్పీ అరుణ్ కుమార్ పరిశీలన

Published

on

భద్రాచలం, BBMA NEWS:

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భద్రాచలం సబ్ డివిజనల్ డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానితులను గుర్తించే లక్ష్యంతో భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాలను తనిఖీ చేయడంతో పాటు నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న అనుమానితులపై నిఘా పెట్టి వారి వివరాలను సేకరించారు.

 

ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని కోరారు.

Continue Reading

News

మైనర్లకు పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం.. కురవిలో పోలీసుల డికాయ్ ఆపరేషన్

Published

on

BBMA NEWS ఆర్టికల్:

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కురవి గ్రామంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కురవి, పోలీసు సిబ్బందితో కలిసి 2 పాన్ షాపులు, 6 టీ స్టాళ్లు, 21 కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. మైనర్లకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా దుకాణ యజమానులకు చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

Trending