Police News
BBMA POLICE E:NEWS// POCSO కేసులో నిందితుడికి జైలు శిక్ష
BBMA POLICE E:NEWS// POCSO కేసులో నిందితుడికి జైలు శిక్ష
G. Uday Bhaskar Rao గారు, HACA Bhavan లోని ప్రత్యేక POCSO కోర్టులో విచారణ జరిపి, చిక్కడపల్లి పరిధికి చెందిన నిందితుడు చువ్వ వీరేశ్ (52)ను దోషిగా నిర్ధారించారు. అతనికి 1 సంవత్సరం 3 నెలలు 23 రోజుల కఠిన కారాగార శిక్షతో పాటు ₹1,500 జరిమానా విధించారు.
11 ఏళ్ల బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఈ కేసులో, బాధితురాలు ధైర్యంగా బయటపడుతూ తల్లికి వివరించింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలికి Bharosa Centre ద్వారా కౌన్సెలింగ్, మానసిక సహాయం అందించబడింది.
పోలీసులు, ప్రాసిక్యూషన్, మహిళా భద్రత విభాగం సమన్వయంతో న్యాయం సాధ్యమైంది. V. C. Sajjanar గారు ఈ కృషిని అభినందించారు.
crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
News
భద్రాచలంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. లాడ్జీలు, బస్టాండ్ ప్రాంతాల్లో డీఎస్పీ అరుణ్ కుమార్ పరిశీలన
భద్రాచలం, BBMA NEWS:
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భద్రాచలం సబ్ డివిజనల్ డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానితులను గుర్తించే లక్ష్యంతో భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాలను తనిఖీ చేయడంతో పాటు నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న అనుమానితులపై నిఘా పెట్టి వారి వివరాలను సేకరించారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని కోరారు.
News
మైనర్లకు పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం.. కురవిలో పోలీసుల డికాయ్ ఆపరేషన్
BBMA NEWS ఆర్టికల్:
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కురవి గ్రామంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కురవి, పోలీసు సిబ్బందితో కలిసి 2 పాన్ షాపులు, 6 టీ స్టాళ్లు, 21 కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. మైనర్లకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా దుకాణ యజమానులకు చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
-
News1 day agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
