Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Politics

హరీష్ రావు సిట్ విచారణకు ముందుకు: రాజకీయ డైవర్షన్‌పై తీవ్ర ఆరోపణలు

Published

on

హరీష్ రావు సిట్ విచారణకు ముందుకు: రాజకీయ డైవర్షన్‌పై తీవ్ర ఆరోపణలు

✴️ సిట్ విచారణకు బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీష్ రావు 👇

 

🔸రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసు ఇచ్చారు.

 

🔸నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసు ఇచ్చి వెళ్లారు

 

🔸చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి నేడు సిట్ విచారణకు వెళ్తున్నాను

 

🔸రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను

 

🔸నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు

 

🔸దండుపాళ్యం ముటా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయటపెట్టా

 

🔸రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి

 

🔸సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కున్నాం

 

🔸తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడం

 

🔸ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, మహిళలకు మహాలక్ష్మి ఏమైంది, అవ్వాతాతలకు రూ. 4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగాం

 

🔸హిల్టీపీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టినం

 

🔸నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నవు

 

🔸కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయటపెట్టినం

 

🔸అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీసినం

 

🔸పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారి మీద నోటీసులు.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చినవు

 

🔸మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తరట

 

🔸పట్టణాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తరట

 

🔸మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నడు

 

🔸బీఆర్ఎస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నడు.

 

🔸సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయి.. 40 శాతం గెలిచి విజయం సాధించింది

 

🔸మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నడు

 

🔸రెండేళ్ల నుంచి ఇదే డ్రామా ఆడుతున్నడు

 

🔸గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే సుప్రీం కోర్టు చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది

 

🔸న్యాయం మా వైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచాం

 

🔸రెండేళ్లు గడిచింది.. ఇదే సీరియల్ ఎన్ని రోజులు నడుపుతావు

 

🔸నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా నీ బొగ్గు స్కాం, పవర్ స్కాం, హిల్టీపీ స్కాం బయటపెడుతం

 

🔸ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉంటం

 

🔸బొగ్గు స్కాంపై నేను కిషన్ రెడ్డి గారిక లేఖ రాస్తున్నా

 

🔸కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింది నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నాం

 

🔸రేవంత్ రెడ్డి, తన బామ్మర్దితో కలిసి చేస్తున్న స్కాం ఎలా జరిగిందో విచారణ జరపాలి

 

🔸నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలి

 

🔸సీబీఐ విచారణ జరపాలి.. వెంటనే బీజేపీ స్పందించాలి

 

🔸దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేస్తున్నాం

 

🔸సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడు

 

🔸 సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడడు

 

🔸న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, నేను తప్పు చేయలేదు, కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగం ఇది

 

🔸రాజకీయ డ్రామా ఇది, మేము భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తం ఎక్కడికైనా వెళ్తం

 

🔸రేవంత్ రెడ్డి ఈ కేసులో నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీం కోర్టు, హైకోర్టు కొట్టి వేసింది

 

🔸తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తాం. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడుతాం

 

🔸మూడు రోజులు ముందే ప్లాన్ వేసి, దావోస్ నుంచి వచ్చే దాకా ఈ సీరియల్ నడవాలని అటెన్షన్ డైవర్షన్

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి

Published

on

వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్‌టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్

హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:

వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్‌టీ డెవలప్‌మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్‌లోని ఈషా ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్‌టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్‌బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్‌టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్

Published

on

ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి

గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Continue Reading

News

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష

Published

on

రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.

దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Continue Reading

Trending