Politics
P. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
P. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది.
మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని తాజా ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వెలువడిన సర్వేలు కాంగ్రెస్ పార్టీకి గట్టి ప్రజా మద్దతు లభించినట్లు సూచిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాలు, నగరాల్లో ఓటర్ల తీరు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం సుమారు 80 నుండి 85 శాతం వరకు స్థానాల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఉన్నాయని చెప్పబడుతోంది.
ఈ పరిణామాలపై మాజీ తెలంగాణ యువజన కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ పి. జలంధర్ రావు స్పందించారు. ప్రజలు అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తమ తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల విస్తరణ వంటి అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ప్రజల ఆశలు, అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వానికే మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.
మున్సిపల్ స్థాయిలో వచ్చిన ఈ స్పందన భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే సూచికగా భావించవచ్చని జలంధర్ రావు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనం అని, దాని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని చెప్పారు. పట్టణాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.
అధికారిక ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాల కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలలో కొత్త మార్పులకు నాంది పలుకుతాయనే చర్చలు వినిపిస్తున్నాయి.
News
మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి
వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్‌టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్
హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:
వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్‌టీ డెవలప్‌మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్‌లోని ఈషా ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్‌టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్‌బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్‌టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
News
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి
గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
News
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
