Telangana
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ,బాలల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని బాధ్యతయుతంగా క్రమశిక్షణతో చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించేవరకు పట్టుదలతో ముందుకెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
News
కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రామగుండంలో సేవా కార్యక్రమాలు
రామగుండం, బీబీఎంఏ న్యూస్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రోజంతా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే కేటీఆర్ రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కోరుకంటి చందర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జవహర్‌లాల్‌నగర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో డయాలసిస్ రోగులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం అమ్మ పరివార్ ఆశ్రమం, ఈశ్వర కృప ఆశ్రమం, తబిత ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వృద్ధులు, నిరాశ్రయులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారని, ఐటీ పార్క్ ఏర్పాటు, నగరాభివృద్ధికి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
News
ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి.. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్ , బీబీఎంఏ న్యూస్, జూలై 24:
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శుక్రవారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవరెడ్డి, గుజ్జ శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, యువమోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
News
అల్లర్లలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు.. పాస్‌పోర్ట్ రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ , బీబీఎంఏ న్యూస్: హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక వివరణ ఇచ్చారు. అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టించేవని, పాస్‌పోర్ట్‌ల రద్దుపై ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు.
అయితే, హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారాన్ని నిజమని నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
