Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ఏఐవైఎఫ్ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్ష కార్యదర్శులుగా నవీన్, మానస్ కుమార్ ఎన్నక

Published

on

పెద్దపల్లి జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి గురువారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆసాల నవీన్, ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి మానస్ కుమార్, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి సురేందర్, సహాయ కార్యదర్శిగా మాచర్ల అంజి, కోశాధికారిగా ఎండీ ఖాజా ఎన్నికయ్యారు. వీరితో పాటు 25 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ వలి ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి గ్రామంలో ఏఐవైఎఫ్‌ను బలోపేతం చేసి యువత హక్కుల సాధన కోసం ఉద్యమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై యువతను చైతన్యపరచాలని సూచించారు.

 

అలాగే జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జూలై 24న విద్యార్థి సంఘాలు నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు యువత, ప్రజలు, విద్యార్థులు, మేధావులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం

Published

on

‘గబ్బర్ సింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించినట్లు సమాచారం. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్నారని తెలుస్తోంది.

‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి గ్యాంగ్‌లో నటించిన రమేష్ తన ప్రత్యేక హావభావాలు, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుని “గబ్బర్ సింగ్ రమేష్”గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు సీనియర్ జర్నలిస్టు ఖాజాపాష (కేపీ) కూడా రమేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Continue Reading

News

ప్రభుత్వ సేవల నాణ్యత పెంపే లక్ష్యం: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

Published

on

*కమాన్‌పూర్, రామగిరిలో తహసీల్దార్ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష

బీబీఎంఏ న్యూస్: పెద్దపల్లి,జూలై 21

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయాలు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, సింగరేణి భూములు, ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలను పరిశీలించారు.

 

గుండారం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెనుకబడిన విద్యార్థులకు అదనపు బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

కమాన్‌పూర్ నూతన తహసీల్దార్ కార్యాలయంలో మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

 

పెంచికల్‌పేట్ సింగరేణి భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని, కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు, వైద్య ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణ, స్టాప్ డయేరియా, ఎన్‌సీడీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

 

రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, మేడిపల్లి వద్ద ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్‌కు ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

నేటి సమాజ మార్పులకు అనుగుణంగా మేదరి సమాజం ముందుకు సాగాలి: ప్రతాపగిరి శ్రీనివాస్

Published

on

హైదరాబాద్: ఉప్పల్ బాగాయత్‌లోని వంజర ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాపగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మేదరి సమాజం విద్య, వైద్యం, విజ్ఞానం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలోనూ మేదరి యువత ముందుకు రావాలని సూచించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేదరి సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పాతకోటి ఉమా, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, సీనియర్ నాయకుడు ప్యారసాని బాలరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కె.పీ. మురళీకృష్ణ, అలిపిరెడ్డి లచ్చయ్య, సులువ కనకయ్య, తుమ్మల శ్రీనివాస్, ప్రతాపగిరి గోవర్ధన్ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending