Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిర్మల్ యువకుడు నిత్యానందరెడ్డి మృతి

Published

on

బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు.. ఎమ్మెస్ కోసం వెళ్లిన యువకుడి మృతితో గ్రామంలో విషాద

నిర్మల్/అమెరికా, బీబీఎంఏ న్యూస్:

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానందరెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో నివసిస్తున్న నిత్యానందరెడ్డి గత శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

గత నాలుగు రోజులుగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నిత్యానందరెడ్డిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అనంతరం శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మూడేళ్ల క్రితం ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి అకాల మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య

Published

on

ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి

జనగామ, బీబీఎంఏ న్యూస్:

జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.

 

ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.

Continue Reading

Andhra

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు

Published

on

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు

విశాఖ, రాజమండ్రిలో కొత్త కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన

 

అమరావతి, బీబీఎంఏ న్యూస్:

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం విశాఖపట్నంలో మూడు, రాజమండ్రిలో మూడు కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కి చేరింది. కడప జిల్లాలో సేకరించిన కరోనా నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పరీక్షల కోసం పంపగా, వాటిలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణైంది.

 

ఇప్పటికే కడప, గుంటూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు (మన్యం), తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Continue Reading

News

ఏఐవైఎఫ్ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్ష కార్యదర్శులుగా నవీన్, మానస్ కుమార్ ఎన్నక

Published

on

పెద్దపల్లి జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి గురువారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆసాల నవీన్, ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి మానస్ కుమార్, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి సురేందర్, సహాయ కార్యదర్శిగా మాచర్ల అంజి, కోశాధికారిగా ఎండీ ఖాజా ఎన్నికయ్యారు. వీరితో పాటు 25 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ వలి ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి గ్రామంలో ఏఐవైఎఫ్‌ను బలోపేతం చేసి యువత హక్కుల సాధన కోసం ఉద్యమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై యువతను చైతన్యపరచాలని సూచించారు.

 

అలాగే జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జూలై 24న విద్యార్థి సంఘాలు నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు యువత, ప్రజలు, విద్యార్థులు, మేధావులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

Trending