Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

నేటి సమాజ మార్పులకు అనుగుణంగా మేదరి సమాజం ముందుకు సాగాలి: ప్రతాపగిరి శ్రీనివాస్

Published

on

హైదరాబాద్: ఉప్పల్ బాగాయత్‌లోని వంజర ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాపగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మేదరి సమాజం విద్య, వైద్యం, విజ్ఞానం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలోనూ మేదరి యువత ముందుకు రావాలని సూచించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేదరి సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పాతకోటి ఉమా, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, సీనియర్ నాయకుడు ప్యారసాని బాలరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కె.పీ. మురళీకృష్ణ, అలిపిరెడ్డి లచ్చయ్య, సులువ కనకయ్య, తుమ్మల శ్రీనివాస్, ప్రతాపగిరి గోవర్ధన్ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

గానకోకిల ఎస్. జానకితో సన్నిహిత అనుబంధం కలిగిన మంథని మహిళ కన్నుమూత

Published

on

బీబీఎంఏ న్యూస్ జూలై 17

మంథని ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం నాగ్‌పూర్‌లో స్థిరపడిన మహావాది మాధురి ఉమాదేవి గుల్కోట్‌వార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇటీవల పూణేలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సంగీతంపై అపారమైన అభిరుచి కలిగిన ఉమాదేవికి ప్రముఖ గాయని ఎస్. జానకితో సన్నిహిత పరిచయం, ఆప్యాయ అనుబంధం ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంథని స్వస్థలమైన ఆమె వివాహానంతరం నాగ్‌పూర్‌లో నివసించినప్పటికీ, స్వగ్రామంతో బంధాన్ని కొనసాగించేవారు. సోదరులు సుధీర్, సతీష్, విజయ్, సోదరీమణులు రమాదేవి, వాణిశ్రీతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. విదేశాల్లో ఉన్న ఆమె పిల్లలు రజని, స్మిత, రవిలు తల్లి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నెల 22న నిర్వహించనున్న ద్వాదశ దినకర్మకు మంథని సహా పలు ప్రాంతాల నుంచి బంధువులు, ఆత్మీయులు హాజరై నివాళులర్పించనున్నారు.

Continue Reading

News

మంథనికి రూ.20 కోట్ల న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.. యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా కీలక అడుగు

Published

on

మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల (ఆర్&బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. ఇక్కడ స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రం మంథనికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలకు ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Continue Reading

News

తెలంగాణ ఉద్యమకారుల హామీలు వెంటనే అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం

Published

on

మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. మంథనిలోని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్‌లో కేకే కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల ఉద్యమకారుల సమావేశంలో మంథని ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉచిత బస్ పాస్, ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు, ఉచిత వైద్యం, ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్, పిల్లలకు ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫోరం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending