News
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు :జిల్లా ఎస్పి అశోక్ కుమార్
గంజాయి తో పట్టుబడ్డ ముగ్గురికి 7 సం” జైలు
₹10,000 జరిమాన…
బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కరికీ ₹10,000 జరిమానా విధించారు.
నిందితుల వివరాలు:
A1: కిన్నరి @ మేకల రాజు, వయసు 29, చిలుకవాడ నివాసం
A2: ఆర్ముల్ల సాయి కుమార్, వయసు 22, జగిత్యాల టౌన్
A3: మడవి చందు, వయసు 22, ఆసిఫాబాద్
కేసు వివరాల ప్రకారం, 28-09-2024 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పట్టణ పోలీసులకు న్యూ బస్టాండ్ సమీపంలోని బాంబే షాపింగ్ మాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశీలనలో అతని వద్ద 250 గ్రాముల గంజాయి గుర్తించబడింది. విచారణలో అతను తన స్నేహితులు ఆర్ముల్ల సాయి కుమార్, మడవి చందు తో కలిసి అధిక లాభాల కోసం గంజాయి కొనుగోలు చేసి అమ్మకానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు.
కేసులో సేకరించిన ఆధారాలు, నిందితుల ఒప్పుకోవడం, సాక్ష్యాల ఆధారంగా, న్యాయమూర్తి నారాయణ 7 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిందితుల చర్యలు చట్టవిరుద్ధమే కాక, సమాజానికి హానికరమైనవని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటారని, ఇలాంటి నేరాలకు పాల్పడినవారెవ్వరూ శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చట్టం పాటించి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని సూచించారు.
ఈ కేసులో నిందితుల శిక్ష సాధించడంలో కృషి చేసిన జగిత్యాల టౌన్ సిఐ కిషోర్, పి.పి. కే. మల్లేశం గౌడ్, సి.ఎం.ఎస్. ఎస్సై ఎస్. శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్‌లు శ్రీనివాస్, మహేంద్ర, కానిస్టేబుల్‌లు రాజు నాయక్, కిరణ్ కుమార్‌లను ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు.
News
కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రామగుండంలో సేవా కార్యక్రమాలు
రామగుండం, బీబీఎంఏ న్యూస్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రోజంతా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే కేటీఆర్ రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కోరుకంటి చందర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జవహర్‌లాల్‌నగర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో డయాలసిస్ రోగులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం అమ్మ పరివార్ ఆశ్రమం, ఈశ్వర కృప ఆశ్రమం, తబిత ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వృద్ధులు, నిరాశ్రయులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారని, ఐటీ పార్క్ ఏర్పాటు, నగరాభివృద్ధికి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
News
కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:
ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News7 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
