Sports
గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
సాఫ్ట్‌బేస్ జాతీయ స్థాయిలో రెండో స్థానం..
బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి, నవంబర్ 14:
గాయత్రి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఏ లాస్యప్రియ్, ఏ మహిమ (9వ తరగతి) మహారాష్ట్రలో ఈ నెల 7 నుండి 9 వరకు జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్‌బేస్ బాల్ క్రీడల్లో ద్వితీయ స్థానం సాధించి తెలంగాణకు, పెద్దపల్లికి ప్రతిష్ఠ తెచ్చారు.
ఈ విజయం పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యార్థుల కృషి, పట్టుదలని ప్రశంసించి అభినందించారు. గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులు జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని, క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్లంకి రజనీ దేవి, ప్రిన్సిపాల్ విజయ్, కోచ్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
Telangana
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిర్మల్ యువకుడు నిత్యానందరెడ్డి మృతి
బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు.. ఎమ్మెస్ కోసం వెళ్లిన యువకుడి మృతితో గ్రామంలో విషాద
నిర్మల్/అమెరికా, బీబీఎంఏ న్యూస్:
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానందరెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో నివసిస్తున్న నిత్యానందరెడ్డి గత శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గత నాలుగు రోజులుగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నిత్యానందరెడ్డిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అనంతరం శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మూడేళ్ల క్రితం ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి అకాల మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Andhra
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు
విశాఖ, రాజమండ్రిలో కొత్త కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన
అమరావతి, బీబీఎంఏ న్యూస్:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం విశాఖపట్నంలో మూడు, రాజమండ్రిలో మూడు కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కి చేరింది. కడప జిల్లాలో సేకరించిన కరోనా నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పరీక్షల కోసం పంపగా, వాటిలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణైంది.
ఇప్పటికే కడప, గుంటూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు (మన్యం), తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News7 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
