Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

Published

on

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్త నియామకాలు చేసింది. ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి:

  • రవి గుప్తా (1990) – హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ డీజీగా మార్పు.

  • సి.వి. ఆనంద్ (1991) – హైదరాబాద్ పోలీస్ కమీషనర్ పదవి నుంచి హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.

  • శిఖా గొయల్ (1994) – సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ నుంచి విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ డీజీగా.

  • స్వాతి లక్రా (1995) – హోమ్ గ్రౌండ్ ఏడీజీపీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ (ఫుల్ అదనపు బాధ్యత).

  • ఎం. మహేష్ భగవత్ (1995) – లా & ఆర్డర్ ఏడీజీపీగా ఉన్న ఆయనకు ఏడీజీపీ (పర్సనల్) అదనపు బాధ్యతలు.

  • చారు సిన్హా (1996) – సీఐడి అదనపు డీజీపీ నుంచి ఏసీబీ డీజీగా బదిలీ.

  • డాక్టర్ అనిల్ కుమార్ (1996) – గ్రేహౌండ్స్–అక్టోపస్ ఏడీజీపీ (ఆపరేషన్స్)గా కొనసాగింపు.

  • వి.సి. సజ్జనార్ (1996) – ఆర్టీసీ ఎండి నుంచి హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా నియామకం.

  • విజయ్ కుమార్ (1997) – ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా బదిలీ.

  • వై. నాగిరెడ్డి (1997) – డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ నుంచి ఆర్టీసీ ఎండి.

  • దేవేంద్ర సింగ్ చాహన్ (1997) – సివిల్ సప్లయిస్ ఎండి నుంచి మల్టీజోన్–II ఏడీజీపీగా.

  • విక్రమ్ సింగ్ మాన్ (1998) – లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమీషనర్ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ.

  • ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999) – సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా నియామకం.

  • ఎం. శ్రీనివాసులు (2006) – సీఐడి ఐజీ నుంచి హైదరాబాద్ అడిషనల్ కమీషనర్ (క్రైమ్స్).

  • తప్సీర్ ఇక్బాల్ (2008) – జోన్–VI డీఐజీ నుంచి లా అండ్ ఆర్డర్ జాయింట్ కమీషనర్.

  • ఎస్‌.ఎం. విజయ్ కుమార్ (2012) – హైద‌రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ నుంచి సిద్దిపేట కమీషనర్.

  • సింధు శర్మ (2014) – ఇంటెలిజెన్స్ ఎస్పీ నుంచి ఏసీబీ జాయింట్ డైరెక్టర్.

  • డాక్టర్ జి. వినీత్ (2017) – మాదాపూర్ డీసీపీ నుంచి నారాయణపేట ఎస్పీ.

  • డాక్టర్ బి. అనురాధ (2017) – ఎల్.బి. నగర్ డీసీపీగా రాచకొండలో కొనసాగింపు.

  • చ. ప్రవీణ్ కుమార్ (2017) – ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియామకం.

  • యోగేష్ గౌతమ్ (2017) – నారాయణపేట ఎస్పీ నుంచి రాజేంద్రనగర్ డీసీపీ (సైబరాబాద్).

  • సి.హెచ్. శ్రీనివాస్ (2018) – హైద‌రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా కొనసాగింపు.

  • రితి రాజ్ (2018) – మాదాపూర్ డీసీపీ (సైబరాబాద్)గా కొనసాగింపు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

Published

on

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

 

ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు

Published

on

కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:

ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

crime

రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు

Published

on

(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.

 

ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Continue Reading

Trending