Telangana
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందిన శివధర్ రెడ్డి హైదరాబాద్‌లో జన్మించి, పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేసిన అనంతరం 1994లో ఐపీఎస్‌లో ఎంపికయ్యారు.
అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల్లో ఏఎస్పీగా, గ్రేహౌండ్స్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా సేవలందించారు. మావోయిస్టుల అణచివేతలో ఎస్ఐబి డీఐజీగా కీలక పాత్ర పోషించారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసి, నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌ను ప్రణాళిక చేయడంలో ముందుండారు. యునైటెడ్ నేషన్స్ శాంతి దళంలో భాగంగా కొసావో మిషన్‌లో కూడా సేవలు అందించారు.
మక్కా మసీదు బాంబు పేలుళ్ల తర్వాత సౌత్ జోన్ డీసీపీగా నియమితులై అల్లర్లు అదుపులో ఉంచడంలో కృషి చేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తరువాత ఏసీబీ అడిషనల్ డైరెక్టర్, డైరెక్టర్‌గా, అలాగే తెలంగాణలో ఐజీ (పర్సనల్), అదనపు డీజీ, అదనపు డీజీపీ (రోడ్ సేఫ్టీ)గా బాధ్యతలు నిర్వహించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు.
2024 ఆగస్టులో డీజీపీగా పదోన్నతి పొందిన శివధర్ రెడ్డి, గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, యుఎన్ మెడల్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు.
News
కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.
News
కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:
ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News6 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
-
News3 weeks agoరామగుండం కార్పొరేషన్లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య
