Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

Published

on

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

బిబిఎంఏ న్యూస్/హనుమకొండ, ఏప్రిల్ 14: తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అంబేద్కర్ ఎస్‌డీఎల్‌సీఈలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బత్తిని వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సముచితమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాపగిరి శ్రీనివాసు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఎడ్యుకేట్, ఆజిటేట్, ఆర్గనైజ్” అనే అంబేద్కర్ సందేశం సమాజ మార్పుకు మార్గదర్శకమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మునికుంట్ల శ్రీనివాస్, అంకం సతీష్, మూల రామకృష్ణ, బిక్షపతి, సుధాకర్ రెడ్డి, రాంభూపాల్, మనోజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కార్పొరేట్లకు రాయితీలు.. ప్రజలకు పన్నుల భారం: కలవేన శంకర్

Published

on

హెడ్

మంచిర్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరుగుతుండగా, కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు.

ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ సరుకులు అందించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్లబజారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

గాంధీనగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

Published

on

మెదక్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీసులు గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా పోలీసులు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, పిల్లల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంలోని ముఖ్యాంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని సూచించారు.

 

అదే విధంగా వాహనాల తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 45 వాహనాలను గుర్తించి తాత్కాలికంగా సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

 

ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

 

Continue Reading

Telangana

ఎలిఫెంట్ ఎన్‌క్లేవ్‌లో రూ.55 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభించిన తోటకూర అజయ్ యాదవ్

Published

on

ఘట్‌కేసర్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న ఎలిఫెంట్ ఎన్‌క్లేవ్ కాలనీలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును బోడుప్పల్ మాజీ మేయర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు వల్ల కాలనీవాసులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంబాల రమేష్, జీవన్ రెడ్డి, పరవత్ రెడ్డి, మంచాల ప్రవీణ్, మద్ది రెడ్డి వెంకట్ రెడ్డి, పొట్ట శ్రీశైలం, భూమయ్య యాదవ్, బాలరాజ్ యాదవ్, అన్నంరాజు సురేష్, పొట్ట విఘ్నేశ్వర్, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి, వినోద్, సుమతి హరిదాసన్, కాలనీ ప్రెసిడెంట్ వాసు, ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రాజు, కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending