Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE E:NEWS// జిల్లా హోంగార్డ్స్‌కు ఇన్సూరెన్స్ తప్పనిసరి: ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్

Published

on

BBMA POLICE E:NEWS// జిల్లా హోంగార్డ్స్‌కు ఇన్సూరెన్స్ తప్పనిసరి: ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్

BBMA POLICE E:NEWS// జిల్లా హోంగార్డ్స్‌కు ఇన్సూరెన్స్ తప్పనిసరి: ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్

జిల్లా హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS గారిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు భద్రత కోసం ఇన్సూరెన్స్ ఎంతో అవసరమని తెలిపారు.

అలాగే వెల్ఫేర్ బెనిఫిట్స్‌ను పెంపొందించేందుకు ప్రతి హోంగార్డ్ నుంచి సేకరించే వెల్ఫేర్ అమౌంట్‌ను రూ.20 నుంచి రూ.200కు పెంచుకోవాలని సూచించారు. ఈ నిధులు అత్యవసర సమయాల్లో వారికి సహాయపడతాయని పేర్కొన్నారు. విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో పని చేయాలని హితవు పలికారు.

జిల్లాలో హోంగార్డ్స్‌కు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు హోంగార్డ్ అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ACB

జగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

Published

on

బిబిఎంఏ న్యూస్ /జగిత్యాల, జూన్ 4:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

సమాచారం ప్రకారం, ఓ వ్యక్తి అధికారిక పనికి సంబంధించి ఎఫ్‌ఆర్‌ఓ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం కొడిమ్యాల అటవీశాఖ కార్యాలయంలో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను పట్టుకున్నారు.

ఈ దాడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Continue Reading

News

ఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

Published

on

హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్‌కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continue Reading

Police News

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

Published

on

By

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.

విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్‌స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్‌ఎస్‌ఐ టి. సూర్య ప్రకాష్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Continue Reading

Trending