News
తిరుపతిలో వైభవంగా కార్తీక దీపోత్సవం…
తిరుపతిలో వైభవంగా కార్తీక దీపోత్సవం…
టీటీడీ పరిపాలన భవనం మైదానంలో గోవింద నామస్మరణ..
బిబిఎంఏ న్యూస్/ తిరుమల
తిరుపతి, నవంబర్ 14, 2025: తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేలాది భక్తులు హాజరై సామూహిక దీపారాధనలో పాల్గొని మైదానాన్ని వెలుగులతో నింపేశారు.
కార్యక్రమం మంగళధ్వనులతో ప్రారంభమైంది. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల పండితుల ఆధ్వర్యంలో వేదస్వస్తి, దీపప్రాశస్త్యం వివరించారు. అనంతరం అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టగా, అర్చకులు శ్రీ మహాలక్ష్మి పూజ చేశారు.
ఎస్వీ సంగీత–నృత్య కళాశాల విద్యార్థుల “శ్రీ లక్ష్మీ ఆవిర్భవం” నృత్య రూపకం భక్తులను ఆకట్టుకుంది. తరువాత భక్తులు దీప మంత్రం జపిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు.
చివరగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవింద నామస్మరణతో నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
ఈ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో వి. వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారు కృష్ణశేషాచల దీక్షితులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News
కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రామగుండంలో సేవా కార్యక్రమాలు
రామగుండం, బీబీఎంఏ న్యూస్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రోజంతా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే కేటీఆర్ రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కోరుకంటి చందర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జవహర్‌లాల్‌నగర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో డయాలసిస్ రోగులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం అమ్మ పరివార్ ఆశ్రమం, ఈశ్వర కృప ఆశ్రమం, తబిత ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వృద్ధులు, నిరాశ్రయులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారని, ఐటీ పార్క్ ఏర్పాటు, నగరాభివృద్ధికి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
News
కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:
ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
