Police News
ARRIVE ALIVE కార్యక్రమాన్ని డీజీపీ శ్రీ బి.శివధర్ రెడ్డి(@TelanganaDGP) గారితో కలిసి ప్రారంభించాం
#Hyderabad ఎల్బీస్టేడియంలో రోడ్ సేప్టీపై అవగాహన కల్పించేందుకు తలపెట్టిన ARRIVE ALIVE కార్యక్రమాన్ని డీజీపీ శ్రీ బి.శివధర్ రెడ్డి(@TelanganaDGP) గారితో కలిసి ప్రారంభించాం. ARRIVE ALIVE కార్యక్రమ పోస్టర్‌ను సినీ ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించాం.
రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతలాగా తీసుకోవాలి.
నగరంలో ప్రతి ఏటా సగటున 3 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 300 వరకు దుర్మరణం చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాపిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహారిస్తున్నాం. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నాం.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
News
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. సీపీ
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. నా•ణ్యమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని ఆదేశం
మంచిర్యాల, బీబీఎంఏ న్యూస్, జూలై 24: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించి చట్టబద్ధంగా పరిష్కరించాలని, ప్రజలపై అనవసర బలప్రయోగానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
ప్రతి పోలీసు అధికారి సీసీటీఎన్‌ఎస్, ఐటీ, ఆధునిక పోలీసింగ్ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించి చట్టపరిధిలో న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
