Andhra
మున్నేరు వాగు పరిసరాలను డ్రోన్ ద్వారా సర్వే చేసిన ఎన్టీఆర్ జిల్లా సిపి కలెక్టర్
పెనుగంచిప్రోలు మున్నేరు వాగు పరిసరాల్లను పరిశీలించిన సిపి, కలెక్టర్
బిబిఎంఏ పోలీస్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్/ విజయవాడ అక్టోబర్ 30
ఎన్.టి.ఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం పరిధిలో ఉన్న మున్నేరు వాగులో వర్షాల కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగా మున్నేరు వాగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహం పెరిగి, లోతట్టు గ్రామాలకు ప్రమాద సూచనలు వ్యక్తమయ్యాయి.

మున్నేరు వాగు పరిసర ప్రాంతాలను డ్రోన్ ద్వారా సర్వే చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సిపి
స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అధికారులు డ్రోన్ల సాయంతో వరద పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. , ఎక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉందో గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీస్, జిల్లా కలెక్టర్ లక్ష్మీష గురువారం ఉదయం స్వయంగా పెనుగంచిప్రోలు ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు.
వీరిద్దరూ డ్రోన్ల సహాయంతో వరద ముంపు ప్రాంతాలను గమనించి, ప్రజలు ఏ ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఉన్నారో, ఎక్కడ నీటి ప్రవాహం అధికమైందో పరిశీలించారు.
వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను రెస్క్యూ టీములు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
తక్షణ అవసరాల కోసం రిలీఫ్ సెంటర్లు, తాగునీరు, ఆహారం, వైద్య సహాయం వంటి సేవలను అందుబాటులో ఉంచారు.
జిల్లా యంత్రాంగం పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్ శాఖలతో సమన్వయంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
ప్రమాద పరిస్థితుల్లో ప్రజలు Dial–112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సంప్రదించాలని అధికారులు సూచించారు.
Andhra
మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ఎమ్మార్పీఎస్
హామీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిక
కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: 2024 ఎన్నికల సమయంలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కచేరిపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు టీడీపీ విజయానికి కృషి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. నాలుగు రోజుల్లో సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
Andhra
పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేత అందించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
అందుబాటు ధరల్లో పశుదాణ సరఫరాకు ప్రత్యేక చర్యలు – సహకార సంఘాలతో సమన్వయంపై అధికారులకు ఆదేశాలు
అమలాపురం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేతను సకాలంలో, అందుబాటు ధరలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సాయి శివ హోమ్ క్యాటిల్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుదాణ నాణ్యత, పాల ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంఓయూ ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన పశుదాణ అందించి పాల ఉత్పత్తి పెంపునకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 150 టన్నుల పశుదాణ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ, సెప్టెంబర్‌తో ముగియనున్న ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు పశుదాణ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Andhra
నషా ముక్త్ భారత్‌కు 10 కోట్ల సంతకాల మహోద్యమం: బ్రహ్మాకుమారీస్
మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనే లక్ష్యం – ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు
కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల సంతకాల సేకరణ మహోద్యమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు, తల్లిదండ్రుల్లో మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మత్తు పదార్థాల వ్యసనం సమాజంలో వేగంగా విస్తరిస్తూ యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సమాజం, రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న ఈ 10 కోట్ల సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములై, మత్తు రహిత భారత నిర్మాణానికి సహకరించాలని బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News6 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
-
News3 weeks agoరామగుండం కార్పొరేషన్లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య
