Sports
ట్రోఫీ లేకుండా భారత్ ఆసియా కప్ సంబరాలు
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమ్ ఇండియా, వింతగా ట్రోఫీ లేకుండా సంబరాలు జరుపుకుంది. ఆటగాళ్లు ఎవ్వరూ మెడల్స్ ధరించలేదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్ కూడా లేదు. కారణం– భారత జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మరియు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేత ట్రోఫీ తీసుకోవడాన్ని నిరాకరించింది.
మొహ్సిన్ నక్వీ పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రిగా కూడా వ్యవహరిస్తుండటం, అలాగే టోర్నమెంట్ సమయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సూర్యకుమార్ మాట్లాడుతూ– “మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎవ్వరూ మాపై ఒత్తిడి చేయలేదు. కానీ గెలిచిన జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం చాలా విచిత్రం. ఇంతకాలం క్రికెట్‌లో ఇలాంటిదేమీ చూడలేదు” అని అన్నారు.
భారత్ అధికారులు ట్రోఫీని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖాలిద్ అల్ జరూని చేతుల్లో నుంచి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, నక్వీ అనుమతి ఇవ్వకపోవడంతో ట్రోఫీ దూరమైంది. దాంతో ఆసియా కప్ ఫైనల్ తర్వాత సుమారు గంట ఆలస్యంగా జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే ఫొటోలు దిగారు.
భారత్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, ట్రోఫీ మాత్రం వేదికపై లేకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
పాకిస్తాన్ కెప్టెన్ అసంతృప్తి
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, భారత జట్టు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. “ట్రోఫీ తీసుకోకపోవడం, చేతులు కలపకపోవడం వంటివి కేవలం మాకు అవమానం కాదు, క్రికెట్ అనే ఆటకే అవమానం. ఇలా ఇతర జట్లు కూడా చేస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుంది?” అని ఆయన ప్రశ్నించారు.
మ్యాచ్ హైలైట్స్
టోర్నమెంట్ డ్రామాకి మించి, ఫైనల్‌లో మాత్రం భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయలో పాకిస్తాన్ 113/1 నుంచి 146కి కుప్పకూలింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యం చేధించింది. తిలక్ వర్మ 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
News
బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య
ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
జనగామ, బీబీఎంఏ న్యూస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.
Telangana
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిర్మల్ యువకుడు నిత్యానందరెడ్డి మృతి
బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు.. ఎమ్మెస్ కోసం వెళ్లిన యువకుడి మృతితో గ్రామంలో విషాద
నిర్మల్/అమెరికా, బీబీఎంఏ న్యూస్:
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానందరెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో నివసిస్తున్న నిత్యానందరెడ్డి గత శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గత నాలుగు రోజులుగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నిత్యానందరెడ్డిని వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అనంతరం శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మూడేళ్ల క్రితం ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి అకాల మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Andhra
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు
విశాఖ, రాజమండ్రిలో కొత్త కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన
అమరావతి, బీబీఎంఏ న్యూస్:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం విశాఖపట్నంలో మూడు, రాజమండ్రిలో మూడు కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కి చేరింది. కడప జిల్లాలో సేకరించిన కరోనా నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పరీక్షల కోసం పంపగా, వాటిలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణైంది.
ఇప్పటికే కడప, గుంటూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు (మన్యం), తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News7 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
