News
రూ.17.09 లక్షల విలువైన 40.173 కిలోల గంజాయి ధ్వంసం
మత్తు పదార్థాల విక్రయం, రవాణాపై ఉక్కుపాదం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరిక
రామగుండం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 81 ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 40.173 కిలోల ఎండు గంజాయితో పాటు 26 గంజాయి మొక్కలను న్యాయస్థానం అనుమతితో ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
న్యాయాధికారుల సమక్షంలో ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం నమూనాలు సేకరించిన అనంతరం, కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్‌సినిరేటర్స్‌లో పర్యావరణ నిబంధనలను పాటిస్తూ గంజాయిని దహనం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయి, గంజాయి మొక్కల మొత్తం విలువ సుమారు రూ.17.09 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, గంజాయి సాగు, రవాణా, నిల్వ, సరఫరా, విక్రయాలతో యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వ చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, జైపూర్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ వినీత తదితర అధికారులు పాల్గొన్నారు.
News
లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్
ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు
లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.
News
టీబీజీకేఎస్‌లో చేరిన 16 మంది కార్మికులు
సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన మిర్యాల రాజిరెడ్డి
మందమర్రి / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:
మందమర్రి సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో 16 మంది కార్మికులు ఏఐటీయూసీ నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. వారికి యూనియన్ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాల కల్పన జరగక కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీలు వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని, సింగరేణి అభివృద్ధికి కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, బండి సదానందం, ఎండి సముద్దీన్, వి. రాజయ్యతో పాటు మొత్తం 16 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఓ. రాజశేఖర్, సీహెచ్ వెంకట్ రమణ, బెల్లం అశోక్, మేడిపల్లి సంపత్, గాలిపెల్లి తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.
News
మంథని ప్రధాన రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయా?
రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు – ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రజల డిమాండ్
మంథని / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:మంథని పట్టణంలో కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రస్తుతం అక్రమ పార్కింగ్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సీఆర్‌కే అపార్ట్‌మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్ డిపో పరిసరాల్లో మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లు, ఇతర వాహనాలను రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ఇరుకైన మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ పార్కింగ్‌పై మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్డుపై వాహనాలు నిలిపే వారిని హెచ్చరించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించి అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని స్థానికులు పోలీసు, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
-
crime3 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment3 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 weeks agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News6 days agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
