Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ఉత్తర్ ప్రదేశ్ ముగ్గురు ఆక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్న యువకుడు..

Published

on

లక్నో, బీబీఎంఏ న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) అనే ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు తమ వీడియోల కోసం పనిచేసే కెమెరామెన్ వికాస్ అలియాస్ విక్కును ఆలయంలో వివాహం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 

అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు వారికి వేర్వేరుగా వివాహాలు చేయాలని ప్రయత్నించగా, విడిపోవడం ఇష్టం లేక ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని తాము నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

ఈ ఘటనపై స్థానిక హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నాయి. దీనికి ప్రతిస్పందనగా అక్కాచెల్లెళ్లు, పూర్వకాలంలో రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారని, అప్పుడు అది తప్పు కాకపోతే ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

అయితే, ఈ వివాహం చట్టపరమైన చెల్లుబాటు, అధికారుల స్పందన వంటి అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రామగుండంలో సేవా కార్యక్రమాలు

Published

on

రామగుండం, బీబీఎంఏ న్యూస్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రోజంతా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే కేటీఆర్ రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కోరుకంటి చందర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జవహర్‌లాల్‌నగర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో డయాలసిస్ రోగులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

మధ్యాహ్నం అమ్మ పరివార్ ఆశ్రమం, ఈశ్వర కృప ఆశ్రమం, తబిత ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వృద్ధులు, నిరాశ్రయులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారని, ఐటీ పార్క్ ఏర్పాటు, నగరాభివృద్ధికి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

News

బమ్మెర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అంబటి నర్సయ్య

Published

on

ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి

జనగామ, బీబీఎంఏ న్యూస్:

జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జనకిరామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సంఘటన జరిగిన తీరుతో పాటు రహదారి పరిస్థితులు, వాహనాల స్థానాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.

 

ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.

Continue Reading

News

కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు

Published

on

కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:

ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending