Telangana
ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Andhra
తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన
తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.
చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.
ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
News
డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం
జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):
జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
News
కార్పొరేట్లకు రాయితీలు.. ప్రజలకు పన్నుల భారం: కలవేన శంకర్
హెడ్
మంచిర్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరుగుతుండగా, కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు.
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ సరుకులు అందించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్లబజారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-
News2 days agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
