Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాకు నూతన అదనపు ఎస్పీగా చైతన్య రెడ్డి బాధ్యతలు

Published

on

POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాకు నూతన అదనపు ఎస్పీగా చైతన్య రెడ్డి బాధ్యతలు

POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాకు నూతన అదనపు ఎస్పీగా చైతన్య రెడ్డి బాధ్యతలు

సంగారెడ్డి జిల్లాలో నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి చైతన్య రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. పోలీసు విభాగంపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా పారదర్శకతతో వ్యవహరిస్తామని అన్నారు.

అపరాధాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల అక్రమ రవాణా వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా పోలీసులను సంప్రదించాలని, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

జిల్లా అభివృద్ధికి, శాంతి భద్రతలకు తన వంతు కృషి చేస్తానని చైతన్య రెడ్డి హామీ ఇచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా

Published

on

హైదరాబాద్ / బిబిఏంఏ న్యూస్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారని పోలీసులు తెలిపారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించి వారి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.

ఈ ముఠా ఇప్పటివరకు 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మహ్మద్ మునవ్వర్ (36) కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడు. చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించలేక స్నేహితులతో కలిసి ఈ మోసానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

మునవ్వర్‌తో పాటు సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆటో, రెండు బైక్‌లు, 25 నకిలీ బంగారు నాణేలు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Continue Reading

News

విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు

Published

on

పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.

Continue Reading

News

లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్

Published

on

ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు

లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.

Continue Reading

Trending