Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

న‌ళినిని ప‌ట్టించుకున్న దిక్కేలేదు

Published

on

డీఎస్పీ న‌ళిని!. ఈ పేరు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో డీఎస్పీగా ఉన్న న‌ళిని.. నాటి పోరా టానికి మ‌ద్ద‌తుగా త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమోదం పొంద‌క‌పోవ‌డంతో రెండోసారి ఆమె రాజీనామా చేసి రాష్ట్ర సాధ‌న‌కు కృషి చేశారు. రాష్ట్రం అయితే.. సిద్ధించింది. కానీ, న‌ళిని ఉద్యోగ‌మే కాదు.. ఆమె జీవితం కూడా యూట‌ర్న్ తీసుకుంది. కేసీఆర్ హ‌యాంలో అస‌లు న‌ళినిని ప‌ట్టించుకున్న దిక్కేలేదు. ఇక‌, సీఎంగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. అనూహ్యంగా ఓ రోజు ఆమె ఆయ‌న‌ను క‌లుసుకుంది. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎప్పుడూ న‌ళిని ప్ర‌స్తావ‌న రాలేదు. తాజాగా ఆమె త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకున్న సుదీర్ఘ లేఖ తెలంగాణ స‌మాజంలో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ సంద‌ర్భం గా న‌ళిని అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. త‌న ఉద్యోగ జీవితం నుంచి ప్ర‌స్తుత ప‌రిస్థితి వ‌ర‌కు ప్ర‌తి మ‌లుపులో జ‌రిగిన అవ‌మా నాన్ని, అన్యాయాన్ని కూడా ఆమె వివ‌రించారు. అలాగ‌ని ఎవ‌రినీ జాలి ప‌డ‌మ‌ని కానీ, బాధ‌ప‌డ‌మ‌ని కానీ ఆమె కోరుకోలేదు. ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్న తాను.. మ‌రికొన్ని రోజుల్లోనే క‌న్నుమూయ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. త‌న‌కు తెలంగాణ స‌మాజం ఉద్యోగం ఇచ్చింద‌ని, కానీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు త‌న‌కు వెన్నుపోటు పొడిచాయ‌ని వివ‌రించారు. ‘ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.“ అని ప్రారంభించిన న‌ళిని పోస్టు.. క‌న్నీరు పెట్టిస్తోంది. నెల రోజులుగా త‌న ఆరోగ్యం సీరియస్ గా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్న‌ట్టు వివ‌రించారు. గ‌త ఎనిమిదేళ్ల కింద‌ట సోకిన విలక్షణ కేన్స‌ర్‌, గత రెండు నెలలుగా టైపాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌ల‌ వల్ల తీవ్ర స్థాయికి చేరిందన్నారు. ప్ర‌స్తుతం చికిత్స చేయించుకునే స్థోమ‌త కూడా త‌న‌కు లేద‌న్నారు. “25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది.” అని వివ‌రించారు. ఇక‌, త‌న గతమంతా వ్యధ భరితమ‌ని న‌ళిని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల త‌న‌ నిలువెల్లా గాయాలే అయ్యాయని తెలిపారు. ”రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.” అని న‌ళిని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం యజ్ఞ బ్రహ్మగా, వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగిన‌ట్టు తెలిపారు. తాను రాజీనామా చేసిన త‌ర్వాత ఇవ్వాల్సిన అల‌వెన్సులు 2 కోట్ల రూపాయ‌లు ఉంటాయ‌ని వాటిని కూడా ఎగ్గొట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వానికి మొర పెట్టుకున్నా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేద‌న్నారు. ”నేను చ‌నిపోవ‌డం ఖాయం. కొన్ని రోజులు మాత్ర‌మే. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చనిపోయాక‌.. `సస్పెండెడ్ ఆఫీసర్` అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేర‌వ‌ద్దు. బ‌తికుండగా నన్ను పట్టించుకొని వారు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.“ అని న‌ళిని విన్న‌వించారు. ఇక‌, త‌న పేరుతో ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలాన్ని రాసిన‌ట్టు వివ‌రించారు. “నా జీవితపు అంతిమ లక్ష్యమైన `మోక్ష` సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను.“ అని న‌ళిని పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

Published

on

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

 

ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు

Published

on

కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:

ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

crime

రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు

Published

on

(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.

 

ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Continue Reading

Trending