Telangana
పేరుకు కేంద్ర సహాయ మంత్రి అన్న పదవే కానీ
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. స్పైసీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న తెలంగాణ సీనియర్ బీజేపీ నేత బండి సంజయ్. పేరుకు కేంద్ర సహాయ మంత్రి అన్న పదవే కానీ.. ఆయన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదనే ఉంటుంది. అందునా.. బీఆర్ఎస్ అగ్రనేతలపై అదిరే వ్యాఖ్యలు చేయటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మార్క్ ఆరోపణలతో ఒక్కసారి అందరిని ఉలిక్కిపడేలా చేశారు. ఇప్పుడు గులాబీ అగ్రనేతల్లో ఒకరైన కేటీఆర్ ను డిఫెన్సులో పడేలా చేసిన బండి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఎలా రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ బండి ఏమన్నారు? ఎలాంటి ఆరోపణలు చేశారు? దీంతో కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరుకున పడినట్లేనా? అన్న ప్రశ్నలకు బండి ఆరోపణల్ని చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా తీసుకొచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగ్జరీ కార్ల స్కాంలో నిందితుడు బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో ఒకదాన్లో కేటీఆర్ ఎందుకుతిరుగుతున్నారు? ఆ కారు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేరుతో ఎందుకు రిజిస్టర్ అయ్యింది? మార్కెట్ ధర చెల్లించారా? లేదంటే ధర తక్కువగా చూపించి కొనుగోలు చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాల నుంచి ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరపగా.. దీనికి సంబంధించి తాను తప్పు చేసిన విషయాన్ని ఆయన అంగీకరించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు..తాను అక్రమంగా తీసుకొచ్చిన కార్ల నంబర్లను అధికారులకు ఖాన్ అందజేసినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన జాబితాలో టీజీ00డి6666 (కావాలనే దీని పూర్తి నెంబరు ఇవ్వలేదన్న విషయాన్ని వెల్లడించటం లేదు) నెంబరు మీద ఉన్న ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని కేటీఆర్ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్ఖాన్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ కాన్వాయ్ లోని వాహనం ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు.దీంతో.. ఈ సంస్థకు కేటీఆర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటన్న ఆరా తీస్తున్న వేళలో.. కేటీఆర్ సతీమణి శైలిమ.. ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బసరత్ కు కేటీఆర్ కు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే సంస్థను ఎలా ఏర్పాటు చేశారు? అందులో ఉన్నోళ్లు ఎవరు? ఈ సంస్థలో కేటీఆర్ సతీమణి శైలిమ డైరెక్టర్ గా ఉన్నారా? లాంటి అంశాలపై క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. బండి ఆరోపణలు నిజమైన పక్షంలో కేటీఆర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారని మాత్రం చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.
News
కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.
News
కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలి: వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24:
ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపవద్దని విద్యార్థి నేతలకు సూచించారు. అనంతరం ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థి నాయకులను విడుదల చేయాలని కోరగా, చర్చల అనంతరం వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు పెద్దపెల్లి గోపాలకృష్ణ, మునిగంటి అనిల్, భాషావేణి తేజస్, సుజిత్, అయాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసన్న, పద్మాకర్‌రెడ్డి, వేల్పుల వెంకటేష్, కొలిపాక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
crime
రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు
(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News6 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
-
News3 weeks agoరామగుండం కార్పొరేషన్లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య
