Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE E:NEWS// మధ్యవర్తులను నమ్మవద్దు – ప్రజావాణి ద్వారా నేరుగా సమస్యల పరిష్కారం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Published

on

BBMA POLICE E:NEWS// మధ్యవర్తులను నమ్మవద్దు – ప్రజావాణి ద్వారా నేరుగా సమస్యల పరిష్కారం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

BBMA POLICE E:NEWS// మధ్యవర్తులను నమ్మవద్దు – ప్రజావాణి ద్వారా నేరుగా సమస్యల పరిష్కారం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి మధ్యవర్తులు అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారని, భూ భారతి సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని, వారు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ప్రజలు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా కలెక్టర్‌ను కలుసుకుని తమ సమస్యలు తెలియజేయవచ్చని తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య కలెక్టర్ ప్రజలను కలుస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

Published

on

హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన భార్య గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, ఉద్యోగరీత్యా పరకాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మహ్మద్ షరీఫ్ ఉద్దీన్‌కు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వెల్లంపల్లి రోడ్డులో ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continue Reading

Police News

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

Published

on

By

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.

విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్‌స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్‌ఎస్‌ఐ టి. సూర్య ప్రకాష్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Continue Reading

News

తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: సీపీ అంబర్ కిషోర్ ఝా

Published

on

 

రామగుండం, జూన్ 2 ( బిబిఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను సీపీ ప్రదానం చేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending