Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Politics

BBMA POLICE E:NEWS// తెలంగాణలో కొత్త శకం ప్రారంభం – ప్రజా ఉద్యమానికి నాంది!

Published

on

BBMA POLICE E:NEWS// తెలంగాణలో కొత్త శకం ప్రారంభం – ప్రజా ఉద్యమానికి నాంది!

BBMA POLICE E:NEWS// కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం

సమయం వచ్చింది. 2026 ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుడుతోంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ప్రజల ఆలోచనలు, ఆశలు, ఆకాంక్షలతో రూపుదిద్దుకుంటున్న ఒక గొప్ప ప్రజా ఉద్యమం.

ప్రజల కోసం, ప్రజలతో కలిసి ముందుకు సాగే ఈ మార్పు పారదర్శకత, నిబద్ధత, అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నాళ్లుగానో ప్రజలు నిజమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు—వారి సమస్యలను వినే, అర్థం చేసుకునే, పరిష్కారాల దిశగా నడిచే నాయకత్వం. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.

యువత నుంచి రైతుల వరకు, ప్రతి వర్గానికీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది. మీ ఆలోచనలు, మీ మద్దతు ఈ మార్పుకు బలంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు మెరుగైన తెలంగాణను అందించేందుకు మనమందరం కలిసి ముందుకు సాగుదాం.

చరిత్ర సృష్టించే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి

Published

on

మందమర్రి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎం.డి. మునీర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా విశేష సేవలు అందిస్తోందని అన్నారు. జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్న ఎం.డి. మునీర్ అభినందనీయులని కొనియాడారు.

 

రచయితగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ పుస్తక రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను అందించడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. పుస్తకాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, యువతలో చదివే అలవాటును పెంపొందించేందుకు ఇలాంటి రచనలు దోహదపడతాయని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

Continue Reading

News

గూడెం అభివృద్ధికి కొత్త ఊపు.. ఆలయ పునరుద్ధరణ, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన

Published

on

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):

ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు.

 

శనివారం దండేపల్లి మండలం గూడెంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు , మంత్రి అడ్లూరి  కుమార్ , మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గూడెం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

 

అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

News

సింగరేణిలో త్వరలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం

Published

on

పారదర్శకంగా నిర్వహించాలి.. కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

హైదరాబాద్/కోల్‌బెల్ట్, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని సూచించారు.

 

ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి తెలిపారు. కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

 

మెడికల్ బోర్డు ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

 

సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Continue Reading

Trending