Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్ల సమీక్ష

Published

on

BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్ల సమీక్ష

BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్ల సమీక్ష

గౌరవ N. Chandrababu Naidu గారు మరియు గౌరవ A. Revanth Reddy గారి పర్యటన సందర్బంగా జిల్లా ఎస్పీ Vakul Jindal గారు, జిల్లా కలెక్టర్ A. Thameem Ansariya గారితో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో పర్యటన మార్గాలు, సభా ప్రాంగణాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అలాగే, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు. భద్రతా దృష్ట్యా ప్రత్యేక దళాలను మోహరించడం, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

ఈ పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

@APPOLICE100

#bundobust

#lawandorder

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా

Published

on

హైదరాబాద్ / బిబిఏంఏ న్యూస్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారని పోలీసులు తెలిపారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించి వారి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.

ఈ ముఠా ఇప్పటివరకు 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మహ్మద్ మునవ్వర్ (36) కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడు. చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించలేక స్నేహితులతో కలిసి ఈ మోసానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

మునవ్వర్‌తో పాటు సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆటో, రెండు బైక్‌లు, 25 నకిలీ బంగారు నాణేలు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Continue Reading

News

విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు

Published

on

పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.

Continue Reading

News

లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్

Published

on

ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు

లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.

Continue Reading

Trending