Police News
BBMA POLICE E:NEWS// మాతా శిశు సంరక్షణ సేవలపై కలెక్టర్ సమీక్ష, మెరుగుదలకు ఆదేశాలు
BBMA POLICE E:NEWS// మాతా శిశు సంరక్షణ సేవలపై కలెక్టర్ సమీక్ష, మెరుగుదలకు ఆదేశాలు
పెద్దపల్లి జిల్లాలో మాతా శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎం.సి.హెచ్ కేంద్రాల పనితీరును విశ్లేషిస్తూ గర్భిణీ మహిళలకు సమయానికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, 102 అమ్మఒడి వాహనాల ద్వారా ఆసుపత్రులకు తరలించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని, ఆశా కార్యకర్తల సమాచారాన్ని సూపర్వైజర్లు పరిశీలించాలని సూచించారు.
ఆసుపత్రుల్లో పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, రోగులకు సరిపడా సీటింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు, టోకెన్ విధానంలో ఓపీ సేవలు, టీకాలు సమయానికి అందించడం వంటి అంశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
News
గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
హైదరాబాద్ / బిబిఏంఏ న్యూస్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారని పోలీసులు తెలిపారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించి వారి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఈ ముఠా ఇప్పటివరకు 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మహ్మద్ మునవ్వర్ (36) కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడు. చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించలేక స్నేహితులతో కలిసి ఈ మోసానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
మునవ్వర్‌తో పాటు సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆటో, రెండు బైక్‌లు, 25 నకిలీ బంగారు నాణేలు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News
విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు
పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.
News
లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్
ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు
లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
