News
BBMA POLICE E:NEWS // మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వ కొత్త పథకాల ప్రకటన
BBMA POLICE E:NEWS // మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వ కొత్త పథకాల ప్రకటన
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారతకు దోహదపడే కొత్త పథకాలను ప్రకటించింది.
🎓 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల విద్య కోసం మహిళలకు ₹1,00,000 వరకు పావలా వడ్డీతో రుణ సౌకర్యం కల్పించనుంది.
💍 ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తెల వివాహాల కోసం దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే లోన్ మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
📱 ఉచిత స్మార్ట్‌ఫోన్లు: మహిళా యానిమేటర్లకు ₹15,000 విలువైన స్మార్ట్‌ఫోన్లు అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించి, వారి అభివృద్ధికి తోడ్పడటం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వస్తోంది.
Andhra
🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
�
BBMA NEWS POLICE E:NEWS//
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.
#AndhraPradesh
– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS
�
News
🔴 BBMA POLICE E:NEWS //మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
News
BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.
మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.
#GHMC
#MunicipalAdministration
#UrbanDevelopment
#PrajaPrabhutvam
-
Politics1 week agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
Police News4 weeks agoఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం
-
News3 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
News2 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
Telangana4 weeks agoజర్నలిస్ట్ గా పేరు… కార్పొరేటర్‌గా ఆశయం: రాం అశోక్
-
News3 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Telangana1 week agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
Police News4 weeks agoసైబర్ బాధితులకు భరోసా: సత్ఫలితాలిస్తున్న హైదరాబాద్ పోలీసుల ‘సీ-మిత్ర’
