News
BBMA POLICE E:NEWS // ఆవు నెయ్యి కొనుగోలుపై దుష్ప్రచారాన్ని ఖండించిన అధికారులు
BBMA POLICE E:NEWS // ఆవు నెయ్యి కొనుగోలుపై దుష్ప్రచారాన్ని ఖండించిన అధికారులు
ఆవు నెయ్యి కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధికారులు పూర్తిగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
KMF (Nandini) సంస్థ కేవలం 10 లక్షల కేజీల నెయ్యిని మాత్రమే సరఫరా చేయగలమని తెలియజేయడంతో దేశవ్యాప్తంగా టెండర్లు పిలవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, Karnataka Milk Federation నుంచే కిలోకు ₹716.92 ధరకు నెయ్యి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.
నెయ్యి అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జరుగుతున్న ప్రచారాల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
YSR Congress Party చేపడుతున్న రాజకీయ కుట్రపై ప్రజలకు పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటానికి పారదర్శక విధానాలతో అన్ని కొనుగోలు ప్రక్రియలు నిర్వహిస్తున్నామని అధికారికంగా వెల్లడించారు.
Andhra
🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
�
BBMA NEWS POLICE E:NEWS//
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.
#AndhraPradesh
– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS
�
News
🔴 BBMA POLICE E:NEWS //మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
News
BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.
మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.
#GHMC
#MunicipalAdministration
#UrbanDevelopment
#PrajaPrabhutvam
-
Politics1 week agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
Police News4 weeks agoఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం
-
News3 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
News2 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
Telangana4 weeks agoజర్నలిస్ట్ గా పేరు… కార్పొరేటర్‌గా ఆశయం: రాం అశోక్
-
News3 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Telangana1 week agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
Police News4 weeks agoసైబర్ బాధితులకు భరోసా: సత్ఫలితాలిస్తున్న హైదరాబాద్ పోలీసుల ‘సీ-మిత్ర’
