Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS // మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష

Published

on

BBMA POLICE E:NEWS // మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష

BBMA POLICE E:NEWS // మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఆయా పరిధిలో పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్ధేశం అందించాను.

పౌరులకు అందించాల్సిన ప్రాథమిక సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ తదితర అంశాలపై పలు సూచనలు చేశాను. మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణలో సమగ్రత ఉండాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించాను.

త్వరలో ప్రతి జోన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే సంబంధిత అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఫీల్డ్‌లో పర్యటించాలని సూచించాను.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

Published

on

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

బీబీఎంఏ న్యూస్ / సుల్తానాబాద్, ఏప్రిల్ 14

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

నంది మేడారం కోర్ట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Published

on

అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడ్వకేట్స్ అసోసియేషన్

 

బీబీఎంఏ న్యూస్ / ధర్మారం, ఏప్రిల్ 14,

పెద్దపల్లి జిల్లా నందిమ్యాడారం కోర్టు ఆవరణలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అడ్వకేట్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలను వక్తలు స్మరించారు.

అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి బొట్ల లక్ష్మీనర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఆకారి రాజేశం, కోశాధికారి నూనే సత్యనారాయణ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి సంపత్ భీమారపు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నారా అశోక్ రెడ్డి, మహిళా న్యాయవాది రాగుల రజిత, కోర్టు పోలీస్ సంతోష్, కోర్టు ప్రాసెస్ సర్వర్ తేజతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చివరగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.

Continue Reading

News

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

Published

on

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

మంథని, ఏప్రిల్ 05 (బీబీఎంఏ న్యూస్):

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. హక్కుల కోసం పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

అయితే జయంతి రోజున మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని అలంకరించకపోవడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహానీయుడికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ⚠️

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లింగయ్య, సుధాకర్, శ్రావణ్, రవికిరణ్ రిషి, ప్రణయ్ సమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending