Police News
తీర్పు న్యాయం విజయం జిల్లా ఎస్పి : నితిక పంత్ ఐపీఎస్
మహిళను అక్రమ రవాణా చేసిన కేసులో నిందితులకు కఠిన శిక్ష ఖరారు.
ఈ తీర్పు న్యాయం విజయం జిల్లా ఎస్పి : నితిక పంత్ ఐపీఎస్
బిబిఎంఎ న్యూస్ /ఆసిఫాబాద్ : నవంబర్ 25:
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 లో జరిగిన మహిళ అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ కఠిన శిక్ష విధించారు. ఒక నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, మిగతా ముగ్గురికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించబడింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
వివరాల ప్రకారం, 01/07/2019న, ముగ్గురు వ్యక్తులు A1, గౌరు బాయి AZ, వెంకటి A3 హరి దాస్ (కానిస్టేబుల్) ద్వారా మహిళను మాయ మాటలతో పని ఇచ్చే వాదనలో మధ్యప్రదేశ్‌లోని లాలాగిరి గోస్వామి వద్దకు తరలించారు. బాధితురాలిని 1,30,000 రూపాయలకే అమ్మారు. కేసును బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తిర్యాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఏ. అశోక్ నమోదుచేశారు.
కాగా, లాలాగిరి గోస్వామి బాధితురాలిని పలుమార్లు అత్యాచారం చేసి, తన వ్యవసాయ పొలంలో పనులు చేయించేవాడిగా తేలింది. ఎవరూ లేకపోవడం వల్ల 25/07/2019 న మహిళ తన ఇంటికి తిరిగి వచ్చారు.
వీటి ఆధారంగా డిఎస్పి ఏ. సత్యనారాయణ చార్జ్‌షీట్ సమర్పించారు. కోర్టులో ఏ ఎస్ఐ ఈశ్వర్ సింగ్ సాక్షులను హాజరుపరిచారు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం రమణారెడ్డి సాక్షులను విచారించి నేరాన్ని ధ్రువీకరించారు.
కోర్టు విచారణలో నేరం స్పష్టంగా రుజువు కావడంతో, ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ A1, A2, A3 నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా, A4 (లాలాగిరి గోస్వామి) కు పదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విధించారు.
జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ, “ఈ తీర్పు న్యాయం విజయం మాత్రమే కాక, మహిళల రక్షణకు కీలకమైన ప్రేసెడెంటిల్ కేసుగా నిలుస్తుంది” అన్నారు.
News
గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
హైదరాబాద్ / బిబిఏంఏ న్యూస్: గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారని పోలీసులు తెలిపారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించి వారి నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.
ఈ ముఠా ఇప్పటివరకు 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మహ్మద్ మునవ్వర్ (36) కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడు. చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించలేక స్నేహితులతో కలిసి ఈ మోసానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
మునవ్వర్‌తో పాటు సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆటో, రెండు బైక్‌లు, 25 నకిలీ బంగారు నాణేలు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News
విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు
పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.
News
లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్
ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు
లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
