Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

కొత్తగూడెం మెగా జాబ్ మేళా…

Published

on

కొత్తగూడెం మెగా జాబ్ మేళా…

374 మందికి నియామక పత్రాలు అందజేత

 

బిబిఎంఏ న్యూస్ / కొత్తగూడెం

 

కొత్తగూడెం లో జరిగిన మెగా జాబ్ మేళాలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 374 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, సింగరేణి సీ&ఎండీ ఎన్. బలరామ్, కలెక్టర్ జితేష్ వి. పటేల్, ఎస్పీ రోహిత్ రాజు, డైరెక్టర్ పా గౌతమ్ పోట్రో, సింగరేణి డైరెక్టర్లు, యూనియన్ నాయకులు సీతారామయ్య, త్యాగరాజు పాల్గొన్నారు.

 

ఏరియా జనరల్ మేనేజర్ శాలెంరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేట్ ఏరియా జీఎంలు, అధికారులు, కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సింగరేణి భూసేకరణపై రాజాపూర్ గ్రామస్తుల ఆందోళన

Published

on

ఓసీపీ-2 పనులను అడ్డుకున్న గ్రామస్తులు.. రాత్రి వరకు రోడ్డుపైనే మహిళల బైఠాయింపు.. అధికారుల హామీ కోసం ఎదురుచూపులు

రామగిరి, ఆగస్టు 13 : సింగరేణి రామగుండం-ఆర్‌జీ-3 ఏరియాలోని ఓసీపీ-2 విస్తరణకు సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై రాజాపూర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణకు సంబంధించిన పీడీ (ప్రొసీడింగ్స్) వివరాల్లో తమ గ్రామానికి చెందిన కుటుంబాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించే వరకు సింగరేణి యాజమాన్యం గని పనులను కొనసాగించవద్దంటూ డిమాండ్ చేశారు.

 

122 ఇళ్ల వివరాలు జాబితాలో లేవంటూ ఆరోపణ

గ్రామస్తుల ప్రధాన ఆరోపణ ప్రకారం.. భూసేకరణకు సంబంధించిన జాబితాలో రాజాపూర్ గ్రామానికి చెందిన సుమారు 122 ఇళ్లను మినహాయించారని తెలిపారు. తమ ఇళ్లు, కుటుంబాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులు, రెవెన్యూ విభాగం, భూసేకరణ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా గని విస్తరణ పనులను కొనసాగించడం సరికాదని అన్నారు.

ఓసీపీ-2 క్యారీ వద్ద ఉద్రిక్తత

 

తమ సమస్యపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఓసీపీ-2 క్యారీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు గని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

 

గ్రామస్తులు ఒకవైపు భూసేకరణలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుండగా, మరోవైపు అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు, భూములు, ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

 

రోడ్డుపై మహిళల బైఠాయింపు

ఆందోళనలో భాగంగా రాజాపూర్ గ్రామానికి చెందిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. సమస్య పరిష్కారం కాకుండా ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. రాత్రి 9 గంటలు దాటుతున్నా మహిళలు రోడ్డుపైనే బైఠాయించి అధికారుల స్పందన కోసం ఎదురుచూశారు.

 

ఆందోళనలో పాల్గొన్న తమ కుటుంబ సభ్యులు, పురుషులు వెళ్లిపోవడంతో వారిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం మధ్య కూడా మహిళలు అక్కడి నుంచి కదలకుండా నిరసన కొనసాగించారు. అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రోడ్డుపైనే ఉంటామని మహిళలు పట్టుబట్టారు.

 

కలెక్టర్, భూసేకరణ అధికారి రావాలని డిమాండ్

రాజాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్, భూసేకరణ అధికారి, రెవెన్యూ అధికారులు, సింగరేణి ఆర్‌జీ-3 ఏరియా ఉన్నతాధికారులు నేరుగా గ్రామానికి లేదా ఆందోళన ప్రాంతానికి వచ్చి తమ సమస్యను వినాలని డిమాండ్ చేశారు.

 

భూసేకరణ జాబితాను గ్రామస్తుల సమక్షంలో మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని, జాబితాలో మినహాయించిన ఇళ్ల వివరాలను చేర్చాలని కోరారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన భూమి, ఇల్లు, ఇతర ఆస్తుల వివరాలను పారదర్శకంగా నమోదు చేసి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తాం

 

“మా గ్రామానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. మా ఇళ్లను జాబితా నుంచి ఎందుకు తొలగించారో అధికారులు సమాధానం చెప్పాలి. సమస్యను పరిష్కరించకుండా గని పనులను కొనసాగిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం” అని గ్రామస్తులు హెచ్చరించారు.

 

భూసేకరణ ప్రక్రియలో తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రాత్రి వరకు మహిళలు రోడ్డుపై బైఠాయించి ఉండటంతో రాజాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భూసేకరణకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి, గ్రామస్తుల అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

News

మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి

Published

on

వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్‌టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్

హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:

వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్‌టీ డెవలప్‌మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్‌లోని ఈషా ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్‌టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్‌బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్‌టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఖాతాదారుల ఫోన్ నంబర్లు మార్చి.. రూ.4.58 కోట్ల బ్యాంకు మోసం

Published

on

కోటా / బిబిఏంఏ న్యూస్: రాజస్థాన్‌లోని కోటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేసిన ఓ మహిళ ఖాతాదారులకు తెలియకుండా వారి ఎఫ్‌డీలు, ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నరేళ్లలో 41 మంది ఖాతాదారులకు చెందిన 110కిపైగా ఖాతాల నుంచి సుమారు రూ.4.58 కోట్లు విత్‌డ్రా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

 

ఖాతాదారులకు లావాదేవీల సమాచారం అందకుండా ముందుగానే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొబైల్ నంబర్ మార్పు ఫారాలపై ఖాతాదారుల సంతకాలు తీసుకుని, వారి కుటుంబ సభ్యుల నంబర్లను నమోదు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం 31 మంది ఖాతాదారుల ఎఫ్‌డీలను గడువుకు ముందే మూసివేసి రూ.1.34 కోట్లకుపైగా అనధికార ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

మిగిలిన మొత్తాన్ని తన, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే ఆ పెట్టుబడుల్లో భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ ఘటన బ్యాంకు అధికారులు, ఖాతాదారుల అప్రమత్తతపై కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాల్లో మార్పులపై బ్యాంకులు కస్టమర్‌ను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఖాతాదారులు కూడా ఎలాంటి ఫారంపైనైనా చదవకుండా సంతకం చేయకూడదు. బ్యాంకు నుంచి వచ్చే ప్రతి ఎస్ఎంఎస్‌ను పరిశీలిస్తూ, మొబైల్ బ్యాంకింగ్ లేదా స్టేట్‌మెంట్ ద్వారా ఖాతా లావాదేవీలను తరచూ తనిఖీ చేసుకోవడం ద్వారా మోసాలను ముందుగానే గుర్తించవచ్చు.

Continue Reading

Trending