Telangana
సైదాపూర్ మండలంలో వర్షానికి పంట నష్టం సహాయక చర్యల్లో అధికారులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వర్షానికి పంట నష్టం సహాయక చర్యల్లో అధికారులు
బీబీఎంఏ న్యూస్/కరీంనగర్
జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగిపోయి రైతులు ఆందోళనకు గురయ్యారు. సైదాపూర్ మోడల్ స్కూల్ కూడా వర్షపు నీటితో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఎంపీడీఓ బి యాదగిరి తాసిల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ తిరుపతి వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్థుల సహకారంతో నీటిని బయటకు తరలించే చర్యలు చేపట్టారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
News
ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో ప్రధాని మోదీ భేటీ..
భారత్–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ
బిబిఎంఏ న్యూస్ / రోమ్ :
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో రోమ్‌లో నిర్వహించిన భేటీ భారత్–ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక అనుబంధాలు మాత్రమే కాకుండా భవిష్యత్ సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ సమావేశం కీలక వేదికగా నిలిచింది.
ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు కృత్రిమ మేధస్సు (AI), కీలక ఖనిజాలు, అంతరిక్ష పరిశోధనలు, అణు శక్తి వంటి వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక, ఆర్థిక, భౌగోళిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భారత్–ఇటలీ కలిసి పనిచేయడం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇటలీ యూరప్‌లో ప్రముఖ పారిశ్రామిక దేశంగా ఉండగా, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేకంగా AI రంగంలో భారత్‌కు ఉన్న ఐటీ నైపుణ్యం, ఇటలీకి ఉన్న పారిశ్రామిక సాంకేతికత కలిస్తే ప్రపంచ మార్కెట్‌లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కీలక ఖనిజాల విషయంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల కోసం చూస్తున్న వేళ భారత్–ఇటలీ సహకారం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతరిక్ష రంగంలో కూడా ఇరు దేశాల మధ్య సహకారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందగా, యూరోపియన్ దేశాలతో కలిసి పనిచేసే అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. అణుశక్తి రంగంలో శుభ్రమైన ఇంధన వనరుల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
భారత్–ఇటలీ మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా చారిత్రాత్మకంగా కొనసాగుతున్నాయి. పర్యాటకం, విద్య, కళలు, వారసత్వ పరిరక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించేందుకు ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, ప్రపంచ నేతలతో సమావేశాలు అంతర్జాతీయ వేదికపై భారత ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం
పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా
జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.
బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News
SRH దుమ్మురేపింది.. వరుసగా 4వ విజయం!
SRH జోరు.. వరుసగా నాలుగో విజయం, పాయింట్ల పట్టికలో మూడో స్థానం
సన్ రైజర్స్ హైదరాబాద్మ రోసారి తమ ఆధిపత్యాన్ని చాటుతూ రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించడం SRH బ్యాటింగ్ శక్తిని స్పష్టంగా చూపించింది. ఈ విజయంతో జట్టు వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసి, ఈ సీజన్‌లో మొత్తం ఐదో విజయాన్ని అందుకుంది.
చేస్‌లో ఓపెనర్ ఇషాంత్కి షన్అ ద్భుతంగా ఆడి 74 పరుగులతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ 57 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి 36 పరుగులతో వేగాన్ని కొనసాగించాడు. ట్రావిస్హె డ్ 6, హెయినరీచ్ క్లాసేన 29 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో పాత్ర పోషించారు.
మొత్తంగా బ్యాటింగ్ యూనిట్ సమిష్టిగా రాణించడంతో SRH సులభంగా విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో RR పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఫలితంతో SRH పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, RRకి ఈ సీజన్‌లో మూడో ఓటమి ఎదురైంది.
ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది.
-
News2 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News4 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News2 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
