News
ప్రభుత్వ సేవల నాణ్యత పెంపే లక్ష్యం: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
*కమాన్‌పూర్, రామగిరిలో తహసీల్దార్ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష
బీబీఎంఏ న్యూస్: పెద్దపల్లి,జూలై 21
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయాలు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, సింగరేణి భూములు, ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలను పరిశీలించారు.
గుండారం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెనుకబడిన విద్యార్థులకు అదనపు బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కమాన్‌పూర్ నూతన తహసీల్దార్ కార్యాలయంలో మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.
పెంచికల్‌పేట్ సింగరేణి భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని, కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు, వైద్య ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణ, స్టాప్ డయేరియా, ఎన్‌సీడీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, మేడిపల్లి వద్ద ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్‌కు ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News
నేటి సమాజ మార్పులకు అనుగుణంగా మేదరి సమాజం ముందుకు సాగాలి: ప్రతాపగిరి శ్రీనివాస్
హైదరాబాద్: ఉప్పల్ బాగాయత్‌లోని వంజర ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాపగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మేదరి సమాజం విద్య, వైద్యం, విజ్ఞానం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ రంగంలోనూ మేదరి యువత ముందుకు రావాలని సూచించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేదరి సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పాతకోటి ఉమా, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, సీనియర్ నాయకుడు ప్యారసాని బాలరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కె.పీ. మురళీకృష్ణ, అలిపిరెడ్డి లచ్చయ్య, సులువ కనకయ్య, తుమ్మల శ్రీనివాస్, ప్రతాపగిరి గోవర్ధన్ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
గానకోకిల ఎస్. జానకితో సన్నిహిత అనుబంధం కలిగిన మంథని మహిళ కన్నుమూత
బీబీఎంఏ న్యూస్ జూలై 17
మంథని ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం నాగ్‌పూర్‌లో స్థిరపడిన మహావాది మాధురి ఉమాదేవి గుల్కోట్‌వార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇటీవల పూణేలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సంగీతంపై అపారమైన అభిరుచి కలిగిన ఉమాదేవికి ప్రముఖ గాయని ఎస్. జానకితో సన్నిహిత పరిచయం, ఆప్యాయ అనుబంధం ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంథని స్వస్థలమైన ఆమె వివాహానంతరం నాగ్‌పూర్‌లో నివసించినప్పటికీ, స్వగ్రామంతో బంధాన్ని కొనసాగించేవారు. సోదరులు సుధీర్, సతీష్, విజయ్, సోదరీమణులు రమాదేవి, వాణిశ్రీతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. విదేశాల్లో ఉన్న ఆమె పిల్లలు రజని, స్మిత, రవిలు తల్లి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నెల 22న నిర్వహించనున్న ద్వాదశ దినకర్మకు మంథని సహా పలు ప్రాంతాల నుంచి బంధువులు, ఆత్మీయులు హాజరై నివాళులర్పించనున్నారు.
News
మంథనికి రూ.20 కోట్ల న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.. యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా కీలక అడుగు
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల (ఆర్&బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. ఇక్కడ స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రం మంథనికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలకు ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
crime2 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News4 days agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime1 week ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana1 week agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment1 week agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News1 week agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News1 week agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
