Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS// నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం – విద్యార్థి బంగారు బ్రాస్లెట్ పోలీసులకు అప్పగింపు

Published

on

BBMA POLICE E:NEWS// నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం – విద్యార్థి బంగారు బ్రాస్లెట్ పోలీసులకు అప్పగింపు

BBMA POLICE E:NEWS// నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం – విద్యార్థి బంగారు బ్రాస్లెట్ పోలీసులకు అప్పగింపు

విజయనగరం పట్టణంలోని గుమ్చి జంక్షన్ వద్ద 22-03-2026 మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఒక ప్రశంసనీయ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం డిఫెన్స్ మరియు పోలీస్ అకాడమీకి చెందిన విద్యార్థి Seetharam కు 2 తులాల బంగారు బ్రాస్లెట్ దొరికింది.

దొరికిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆయన నిజాయితీగా ఆ బ్రాస్లెట్‌ను విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ చర్య ఆయన బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచింది.

పోలీసులు విద్యార్థి నిజాయితీని అభినందిస్తూ, ఇలాంటి సంఘటనలు సమాజంలో నమ్మకాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి విలువలను పాటిస్తూ దొరికిన వస్తువులను యజమానులకు చేరేలా పోలీసులకు అప్పగించాలని సూచించారు.

ఈ సంఘటన సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.

@APPOLICE100

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

News

స్మోకింగ్ జోన్లపై గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Published

on

 

బిబిఎంఏ న్యూస్/ రామగుండం పోలీస్ కమిషనరేట్,

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మోకింగ్ జోన్లు, పాన్ షాపులు మరియు పబ్లిక్ ప్రదేశాల్లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫజాలోద్దీన్ ఆయనతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

స్మోకింగ్ జోన్లలో చట్టబద్ధ అనుమతులు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, మైనర్లకు సిగరెట్లు అమ్మకం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. టీ స్టాల్స్ పేరుతో యువతను మత్తు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Continue Reading

News

నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ మడతరమేష్ 

Published

on

నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ ఎం రమేష్

 

బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని మే 11

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నేరచరిత్ర, జీవన విధానం, ఉద్యోగ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవివర్మ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Continue Reading

Trending