Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం

Published

on

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం

ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్!

 

●తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం

 

●హైదరాబాద్‌లో పకడ్బందీగా బాధితుల/పౌర కేంద్రీకృత విధానం అమలు

 

●నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడి

 

నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న చారిత్రాత్మక బాధితుల/పౌర కేంద్రీకృత విధానాన్ని హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. తెలంగాణ సీఐడీ విభాగం రూపొందించిన నూతన ‘విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్’ విధానం ప్రకారం.. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక ప్రయాసగా మారకూడదనే సదుద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఈ గొప్ప ముందడుగు వేసిందని అన్నారు.

 

ఈ నూతన విధానం అమలుపై బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో అవగాహన సమావేశం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో బాధితులకు త్వరతగతిన సేవలందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, బాధితులు ఆసుపత్రిలో ఉన్నా సరే, పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే కేసు నమోదు చేస్తారని తెలిపారు.

 

గతంలో ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉండటం.. అప్పటికే మానసిక ఆందోళనలో ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగించేదని ఆయన గుర్తుచేశారు. ఈ పౌర కేంద్రీకృత విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, పోలీసులే స్వయంగా వారి వద్దకు వెళ్తారని స్పష్టం చేశారు.

 

ఈ విధానం అమలులో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధిత పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. అకారణంగా ఏ ఒక్క బాధితుడైనా పోలీస్ స్టేషన్ కు తిరగాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. బాధితుల గౌరవానికి, గోప్యతకు భంగం కలగకుండా ఈ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. బాధితుల/పౌర కేంద్రీకృత విధానం ప్రకారం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 94906 16555 వివరాలు పంపాలని సూచించారు.

 

సైబర్ నేర బాధితుల కోసం ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించిన ‘సి-మిత్ర’తో పాటు, ఇప్పుడు ఈ నూతన విధానం కూడా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని సీపీ తెలిపారు. పోలీస్ శాఖ ఖ్యాతిని పెంచేలా ఈ అద్భుతమైన విధానాన్ని రూపొందించిన డీజీపీ శ్రీ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్ గారికి, సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారికి సీపీ సజ్జనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

పీఆర్వో,

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

Published

on

By

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ

ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//

ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।

Continue Reading

Police News

POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର

Published

on

By

POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର

POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର

 

ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//

 

ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।

Continue Reading

Police News

POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା

Published

on

By

POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା

POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା

 

ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//

 

ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।

Continue Reading

Trending