Police News
రథసప్తమి వేడుకలకు పటిష్ట పోలీస్ ఏర్పాట్లు
పత్రికా ప్రకటన.
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
*సామాన్య భక్తుల దర్శనమే ప్రాధాన్యత.*
*గత ఏడాది కన్న తక్కువ సమయానికి – ఆదిత్యని దర్శనమయ్యేలా జిల్లా పోలీస్ శాఖ చర్యలు*.
*డ్రోన్ సిసి కెమెరాలు- కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానంతో ప్రత్యేక పర్యవేక్షణ*.
*ప్రశాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వాహణకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు*.
*జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు*.
*అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు*.
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల నేపథ్యంలో క్యూ లైన్ల నిర్వహణ, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ — గత సంవత్సరం సుమారు 1,10,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా, ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం పండుగ రోజున రావడం, ఇటీవల జరిగిన పండుగల సమయంలో హాజరైన భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ఈసారి భక్తుల సంఖ్య సుమారు 1,50,000 వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.అందుకు అనుగుణంగా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా పోలీసు శాఖ సమన్వయంతో ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
🚍 వాహనాల పార్కింగ్ &
నరసన్నపేట, టెక్కలి, పలాస వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు అంపోలు జంక్షన్ మీదుగా వాడాడ జంక్షన్‌కు చేరుకోవాలని సూచించారు.
గార మెయిన్ రోడ్డుపై వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టౌన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు మిల్ జంక్షన్ – ముసలయ్య కాలనీ ప్రాంతంలో కేటాయించిన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వాహనాల అధిక రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా వచ్చే వాహనాలకు వెలమ వీధి వద్ద ఉన్న మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో అదనపు పార్కింగ్ స్థలం కేటాయించబడిందని తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ఆలయానికి ఉచిత దర్శనం / రూ.100 దర్శనం క్యూలైన్ దూరం సుమారు 500 మీటర్లు మాత్రమే ఉంటుందని వివరించారు. అదనంగా ఉమెన్స్ కాలేజ్ – 80 అడుగుల రహదారి మార్గంలో కూడా అదనపు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా మిల్ జంక్షన్ నుండి ఒప్పంగి జంక్షన్ వరకు అత్యవసర సేవల వాహనాలు(అంబులెన్స్‌లు, మెడికల్ సేవలు, ఆహార సరఫరా, ప్రజాసేవ వాహనాలు) మాత్రమే అనుమతించబడతాయని, ఇతర వాహనాలకు అనుమతి ఉండదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
దర్శన ఏర్పాట్లు & క్యూ లైన్ల నిర్వహణ.భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం రూ.500 దర్శనం, డోనర్ క్యూ లైన్‌లను వేర్వేరుగా విస్తరించడంతో పాటు ఆన్‌లైన్ టికెట్ సౌకర్యం కూడ కల్పించబడిందన్నారు. డోనర్ పాస్‌పై గరిష్టంగా నాలుగు పాస్‌లు అనుమతించబడతాయని, వారికి ప్రత్యేకంగా కేటాయించిన సమయ స్లాట్ ప్రకారం భక్తులు సకాలంలో హాజరై దర్శనం చేసుకోవాలని కోరారు.
దర్శనానంతరం భక్తులు తిరిగి వెళ్లే మార్గంలో ప్రసాద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.క్యూలైన్‌లలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్రౌడ్ హోల్డింగ్ ఏరియాలను కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక పాస్ కలిగిన వారు మరియు ఆన్‌లైన్ టికెట్లు కలిగిన భక్తులు తమ టికెట్ల, పాస్‌ను చూపించి QR స్కానింగ్ అనంతరం నిర్దేశించిన మార్గాల ద్వారా ప్రవేశించి ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయబడ్డాయని పేర్కొన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల వెంట త్రాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా గర్భగుడిలో నాలుగు వరుసల క్యూ లైన్ల నిర్వహణ చేపట్టడం ద్వారా భక్తులు తక్కువ సమయంలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
పాదరక్షకులు స్టాండ్ ఏర్పాటు. గత సంవత్సరం భక్తులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం క్రింది మూడు ప్రాంతాలలో పాదరక్షకులు పెట్టుకునేందుకు స్టాండ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి:
మామిడి తోట,అసిరితల్లి జంక్షన్,వెలమ వీధి వద్ద ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రముఖ వ్యక్తులు దర్శనం దర్శనం & మార్గదర్శకాలు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం VVIPలకు మెయిన్ ఆర్చ్ ద్వారా ప్రవేశం కల్పించి, వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం నిర్వహించి, దర్శనానంతరం గర్భగుడి వెనుక వైపు నుండే బయటకు పంపే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
VVIP వాహనాలు గుండు రమణయ్య జియో పెట్రోల్ బంక్ – ఆదిత్య నగర్ కాలనీ – శుభం అపార్ట్‌మెంట్ – DEO ఆఫీస్ – ఉమెన్స్ కాలేజ్ రోడ్ – సూర్యమహల్ జంక్షన్ మార్గంలో వెళ్లాలని సూచించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు & భద్రత.ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు కేఆర్ స్టేడియంలో నిర్వహించబడుతున్నాయని, వాటికి హాజరయ్యే భక్తుల వాహనాల పార్కింగ్‌ను ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. VIP వాహనాలకు మాత్రం కేఆర్ మైదానం వెనుకభాగంలోని హాస్పిటల్ మార్గం ద్వారా అనుమతి ఉంటుందని తెలిపారు.
ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలలో గ్యాలరీలు, బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రాంతాలలో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలను స్పష్టంగా విడగొట్టినట్లు పేర్కొన్నారు.
పర్యవేక్షణ & ప్రజలకు విజ్ఞప్తి.రథసప్తమి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సాధారణ భక్తులు సగటున అరగంటలోపు దర్శనం చేసుకునే విధంగా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
భక్తులందరూ పోలీసు శాఖ సూచించిన ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను, భద్రతా నియమాలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Police News
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News4 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News2 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
