Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

అగ్గిమల్ల గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తాడవేని భాగ్యవ్వ రాజయ్య మ్యానిఫెస్టో విడుదల

Published

on

అగ్గిమల్ల గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తాడవేని భాగ్యవ్వ–రాజయ్య మ్యానిఫెస్టో విడుదల

బిబిఎంఏ న్యూస్ / అగ్గిమల్ల

జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించబడిన నేపథ్యంలో సర్పంచ్ పదవికి తాడవేని భాగ్యవ్వ–రాజయ్య నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల గుర్తుగా బ్యాట్ కేటాయించబడడంతో గ్రామంలో ఆమెకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది.

ఈ సందర్భంగా భాగ్యవ్వ–రాజయ్య గ్రామ ప్రజలతో మాట్లాడుతూ, తమకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామ సేవకులుగా పనిచేస్తూ అగ్గిమల్లలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అగ్గిమల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

గ్రామంలోని అన్ని కుల సంఘాలకు భవనాల నిర్మాణం, శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం, ప్రతి వాడకు వీధి దీపాలు, అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. అలాగే నర్సింహ స్వామి దేవాలయం, పోచమ్మ గుడి, వైకుంఠధామానికి రోడ్లు, గ్రామ చెరువు మరమ్మత్తులు చేస్తామని ప్రకటించారు.

యువత, విద్యార్థుల కోసం ఓపెన్ జిమ్, గ్రంథాలయం, స్టడీ హాల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన యువతకు ఉచిత కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. పెన్షన్ సమస్యల పరిష్కారం, ఇంద్రమ్మ ఇళ్ల శాంక్షన్, పాఠశాలల్లో నీటి సమస్య తొలగింపు, భీమా పాలసీలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

మూడు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించి ప్రజల సలహాలతో అభివృద్ధి పనులు చేపడతామని, గ్రామ పెద్దమ్మ దేవాలయ సెంటర్‌లో శివాజీ విగ్రహం, కాలనీ బోర్డుల ఏర్పాటు కూడా చేస్తామని తెలిపారు.

గ్రామాభివృద్ధే ధ్యేయంగా తమను ఆశీర్వదించి గెలిపించాలని తాడవేని భాగ్యవ్వ–రాజయ్య అగ్గిమల్ల గ్రామ ప్రజలను కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం

Published

on

జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 

కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending