Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

నేడు రెండో విడత పంచాయితీ పోరు భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

Published

on

నేడు రెండో విడత పంచాయితీ పోరు
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

3,911 సర్పంచులు, 29,903 సభ్యులకు ఎన్నిక 28,278 మంది అభ్యర్థులు పోటీ

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్

బిబిఎంఏ/ హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణలో రెండో దశ

పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని అధికారులు పరిశీలించుకున్నారు. అలానే ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పట్టణాల్లో ఉంటున్న ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఏకగ్రీవాలు కాకుండా రెండో దశలో 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగియడంతో, అధికారులు పోలింగ్కు సన్నద్ధమయ్యారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు 14న ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు బాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి కౌంట్ పక్రియ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం 3,834 సర్బంద్, 27,600కు

పైగా వార్డులకు జరిగిన తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అద్భుతమైన సత్తా చాటారు. తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా 2,872 స్థానాల్లో విజయం సాధించారు. పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రకటించినా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు కేవలం 1,160 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు దారుణంగా కేవలం 195 స్థానాలకే పరిమితమయ్యారు. 460 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల

కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ చోటుచేసుకోకుండా పోలీసులు ఘటనలు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు, తొలి విడత ఫలితాల జోరుతో రెండో విడత పోలింగ్కు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు సన్నద్ధమయ్యారు. ఇక మూడో విడత ఎన్నికలకు పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. వికారాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు సాఫీగా జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్? జైన్ సూచించారు. 14న 7 మండలాల్లో పోలింగ్ ఉందన్నారు. 13 ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, సాయంత్రం పోలింగ్ మెటీరియల్ ను తీసుకొని బూత్లకు వెళ్లిపోయేలా ఆదేవ్వలు ఇచ్చారు. గుర్తింపు లేని వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం

Published

on

జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 

కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending