News
BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్ల సమీక్ష
BBMA POLICE E:NEWS// ముఖ్యమంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్ల సమీక్ష
గౌరవ N. Chandrababu Naidu గారు మరియు గౌరవ A. Revanth Reddy గారి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ Vakul Jindal గారు, జిల్లా కలెక్టర్ A. Thameem Ansariya గారితో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సమీక్షలో ముఖ్యంగా పర్యటన మార్గాలు, సభా ప్రాంగణాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
అలాగే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. పర్యటన సాఫీగా, శాంతియుతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
@APPOLICE100
#bundobust
#lawandorder
News
నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ మడతరమేష్
నేరప్రవర్తన మానకుంటే జైలు జీవితం తప్పదు : ఏసీపీ ఎం రమేష్
బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని మే 11
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నేరచరిత్ర, జీవన విధానం, ఉద్యోగ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవివర్మ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
News
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ లావణ్య
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీటీమ్ ఆధ్వర్యంలో జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్ ఇంచార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, కళాశాలల వద్ద షీటీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందన్నారు. వేధింపులకు గురైతే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సైబర్ మోసాలు, లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో షీటీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత పాల్గొన్నారు.
crime
ప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
బిబిఎంఏ న్యూస్/ 8 ఇంక్లైన్ కాలనీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-II టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి టాటా జెస్ట్ కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. సోమవారం గోదావరిఖని-II టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావుతో కలిసి ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ ఈ నెల 29న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోవడంతో, అతని తల్లి జూల శంకరమ్మ మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీడీఆర్, మొబైల్ కాల్ వివరాలను పరిశీలించగా అలేఖ్య, నీలం నవీన్, బుర్ర భాస్కర్‌లపై అనుమానం వ్యక్తమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. వంశీ, అలేఖ్య పదో తరగతి సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అలేఖ్య నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల వంశీ అలేఖ్యను తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడంతో పాటు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి గొడవలకు దిగినట్లు తెలిసింది. దీంతో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని పథకం రచించారు.
పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్‌కు రప్పించారు. భాస్కర్ ఫ్లాట్‌లో మద్యం తాగించిన అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో ఛాతి, మెడ భాగాల్లో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మంథని మండలం గాడుదులగండి ప్రాంతంలోని లోయలో పడవేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు.
-
crime3 hours agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News2 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News3 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment1 day agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
News5 days agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment1 day agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
-
News5 days agoరోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
