Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

జగ్నెకి రాత్ సందర్భంగా మసీద్‌లలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంబర్ కిశోర్ ఝా

Published

on

బీబీఎంఏ న్యూస్ / పెద్దపల్లి:

పవిత్ర రంజాన్ మాసంలోని ముఖ్యమైన రోజు అయిన జగ్నెకి రాత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని మసీద్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మసీద్‌లలో ప్రార్థనలకు వచ్చిన ముస్లిం సోదరులతో సీపీ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

రాత్రి సమయంలో జరిగే ప్రత్యేక నమాజ్ కార్యక్రమాలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు.

పండుగల సందర్భంగా ప్రజలందరూ పరస్పర సహకారంతో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, సామాజిక ఐక్యతను మరింత బలపరచాలని సీపీ అంబర్ కిశోర్ ఝా విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, నరేష్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Published

on

జగిత్యాల, జూన్ 2 (బీబీఎంఏ న్యూస్): జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మంత్రివర్యులకు పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన ఎస్పీ, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలపై సంక్షిప్తంగా వివరించినట్లు సమాచారం. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

News

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్ రెడ్డి

Published

on

 

బిబిఎంఏ  న్యూస్

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని సీఎం తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను మరింత సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

 

రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక, సామాజికంగా వారిని బలోపేతం చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన పాలనను అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునే సందర్భమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Continue Reading

News

బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు తరలింపు!

Published

on

హైదరాబాద్, మే 30 (బీబీఎంఏ న్యూస్):

 

బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

 

మూడు రోజుల క్రితం సింగరేణి అంశంపై మాట్లాడిన బాల్క సుమన్, సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని వ్యాఖ్యానించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

అయితే తన అరెస్ట్ వార్తలను బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.

Continue Reading

Trending