News
బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు తరలింపు!
హైదరాబాద్, మే 30 (బీబీఎంఏ న్యూస్):
బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మూడు రోజుల క్రితం సింగరేణి అంశంపై మాట్లాడిన బాల్క సుమన్, సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని వ్యాఖ్యానించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే తన అరెస్ట్ వార్తలను బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.
News
బయట ధరల కంటే రూ.10 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపణ.. డిపో అధికారులకు ఫిర్యాదు
జూలై 15 (బీబీఎంఏ న్యూస్):కరీంనగర్ ఆర్టీసీ డిపో బస్‌స్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వినియోగదారుల నుంచి వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త గోనె మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.
బయట మార్కెట్‌లో రూ.10కు లభించే ఇండిపెండెంట్ గోల్డ్ కంపెనీ నీటి బాటిల్‌ను బస్‌స్టాండ్‌లోని దుకాణాల్లో రూ.20కు విక్రయిస్తున్నారని, అలాగే టాటా ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను కూడా మార్కెట్ ధర కంటే రూ.10 అధికంగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దుకాణ సిబ్బందే చెబుతున్నారని ఆయన అన్నారు.
బస్‌స్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, సామాన్య ప్రజలు అధిక ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అన్ని వస్తువులను ముద్రిత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) లేదా బయట మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గోనె మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
crime
2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
పెద్దపల్లి, జూలై 14 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలో బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏఈని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేష్ దర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఏఈ నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Andhra
విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్‌పై వెళ్తుండగా పుంగనూరు టోల్‌గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్‌లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-
crime1 week agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
crime2 days ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana4 days agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 days agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 days agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News2 weeks agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
