Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Published

on

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

జిల్లా పోలీస్ కార్యాలయం,

సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 28.02.2026.

• సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి. శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్. గారు.

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుండి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ గారు సూచించారు.

 అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

BBMA POLICE e:NEWS // ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్

Published

on

By

BBMA POLICE e:NEWS // ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్

జిల్లా పోలీసు కార్యాలయం,

సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన తేది: 24.02.2026,

 

*• ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..*

*జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.*

 

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో, పరీక్ష కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచకూడదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు. ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతర ఎవరూ కూడా పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని తెలిపారు.

 

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తమ తమ పరిధిలోని ప్రతి పరీక్ష కేంద్రాన్ని ప్రత్యేకంగా సందర్శించి కనీస వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది ఎగ్జామ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని, ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రాలకు మరియు పరీక్ష అనంతరం పోస్టాఫీసుకు తరలించే వరకు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని తెలిపారు.

పరీక్ష కేంద్రాల లోపల ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆ

Published

on

By

BBMA POLICE E:NEWS ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆ

BBMA POLICE E:NEWS

ಈ ದಿನ ಬೂದನೂರು ಉತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಚಿಕ್ಕಮಂಡ್ಯದಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾಗಿದ್ದ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ರೈಡ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾನ್ಯ ಕೃಷಿ ಹಾಗೂ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾದ ಶ್ರೀ ಎನ್ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ ಅವರು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾನ್ಯ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಗಳು ಸೇರಿದಂತೆ ಹಲವು ಗಣ್ಯರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು.

ಕಾರ್ಯಕ್ರಮದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಸುರಕ್ಷತೆಯನ್ನು ಗಮನದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಅಗತ್ಯ ಭದ್ರತಾ ಕ್ರಮಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಜನಸಂದಣಿ ನಿಯಂತ್ರಣ ಮತ್ತು ಸಂಚಾರ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸಮರ್ಪಕವಾಗಿ ನಿರ್ವಹಿಸಲು ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿಯನ್ನು ನಿಯೋಜಿಸಲಾಗಿತ್ತು. ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆಗಳು ನಡೆಯದಂತೆ ಮುನ್ನೆಚ್ಚರಿಕಾ ಕ್ರಮಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸುಗಮವಾಗಿ ನಡೆಸಲು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಸೂಕ್ತ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡಿತ್ತು. ಸಾರ್ವಜನಿಕರ ಸಹಕಾರದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಶಾಂತಿಯುತವಾಗಿ ಯಶಸ್ವಿಯಾಗಿ ನಡೆಯಿತು.

Continue Reading

Police News

BBMA POLICE E:NEWS ‘కూల్ లిప్’ నికోటిన్ ఉత్పత్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు

Published

on

By

BBMA POLICE E:NEWS ‘కూల్ లిప్’ నికోటిన్ ఉత్పత్తులపై కఠిన చర్యలకు ఆదేశాలు

BBMA POLICE E:NEWS

యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ మాదక పదార్థాల వినియోగంపై జిల్లాలో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రమాదకర ఉత్పత్తులు విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి నిషేధిత పదార్థాల విక్రయంపై ప్రత్యేక దాడులు నిర్వహించి, సరఫరా గొలుసును గుర్తించి కట్టడి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా మాదక పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

Continue Reading

Trending