Telangana
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
బిబిఎంఏ న్యూస్ | రామగిరి
రామగిరి మండలం పరిధిలోని సెంటినరీ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ సమీపంలో బేగంపేట్ గ్రామానికి చెందిన మోలుగురి కోమురయ్య (58) హత్యకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, నారాయణపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య స్థానికంగా జరిగిన వివాహ కార్యక్రమానికి సెంటినరీ కాలనీకి వచ్చాడని తెలుసుకున్న బుర్ర రాజకోమురయ్య పాత కక్షల నేపథ్యంలో సత్తయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో సత్తయ్యకు చేతికి గాయాలయ్యాయి.
సత్తయ్యను రక్షించేందుకు వచ్చిన అతని అన్న కోమురయ్యపై నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో కోమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News
BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.
మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.
#GHMC
#MunicipalAdministration
#UrbanDevelopment
#PrajaPrabhutvam
Telangana
రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్ని
రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్నిక
రామగుండంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు.
ఈ ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆశీస్సులతో పాటు పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఈ ఎన్నిక ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు నాయకులు వెల్లడించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యలు మాట్లాడుతూ… రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య సేవల బలోపేతం, పట్టణ మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వేగవంతంగా పరిష్కరించే విధంగా కార్పొరేషన్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అభినందనలు తెలిపారు. రామగుండం అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి నగరాన్ని ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.
విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ వేడుకలు..
బిబిఎంఏ న్యూస్/వైజాగ్
భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించనున్న IFR, MILAN, IONS, అంతర్జాతీయ సిటీ పరేడ్ – ICP–2026 కార్యక్రమాలు విశాఖపట్నం నగరంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు గౌరవనీయులైన రాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో నగర భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై పోలీస్ కమిషనరేట్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా రామకృష్ణ బీచ్ రోడ్ పరిధిలో రిహార్సల్స్, ఫుల్‌డ్రెస్ రిహార్సల్, పరేడ్ సందర్భంగా ప్రత్యేక కట్‌ఆఫ్స్, డైవర్షన్లు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
రిహార్సల్స్ – ఫిబ్రవరి 16, 17
మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీచ్ రోడ్‌లో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీ పరేడ్‌కు కేటాయిస్తారు. ఈ సమయంలో ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ వద్ద వాహనాలకు డైవర్షన్లు ఉంటాయి. బీచ్ సందర్శకులు సాయంత్రం 6 తర్వాత మాత్రమే రావాలని సూచించారు.
ఫుల్‌డ్రెస్ రిహార్సల్, ICP – ఫిబ్రవరి 18, 19
మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం జంక్షన్ నుంచి నావల్ కోస్టల్ బ్యాటరీ వరకు, సీఆర్ రెడ్డి సర్కిల్,
ఆల్ ఇండియా రేడియో జంక్షన్, పాండురంగాపురం డౌన్, నావల్ కాంటీన్ జంక్షన్, పందిమెట్ట, నోవోటెల్ హోటల్ ప్రాంతాల వరకు పాస్‌లు లేని వాహనాలకు అనుమతి ఉండదు.
పాస్ ఉన్న వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు
VIP పాస్‌లు కలిగిన వాహనాలు సిరిపురం పెట్రోల్ బంక్ – ఏఐఆర్ – పాండురంగాపురం మార్గంలో వేదిక వద్ద దిగి, కాళీమాత ఆలయం ఎదురు పార్కింగ్ లేదా సీ పెర్ల్ పార్కింగ్‌లో వాహనాలు నిలిపివేయాలి.
APIIC గ్రౌండ్, AU ఇంగ్లిష్ మీడియం స్కూల్ గ్రౌండ్, AU జిమ్నాసియం గ్రౌండ్‌లలో రంగు పాస్‌ల ఆధారంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.
సాధారణ వాహనదారులకు మార్గదర్శకాలు
పార్క్ హోటల్ పక్కన ఉన్న MGM గ్రౌండ్‌లో వాహనాలు నిలిపివేసి, అక్కడి నుంచి కాలినడకన బీచ్‌లోకి ప్రవేశించాలి. MGM పార్కింగ్ నిండిన తర్వాత కురుపాం టవర్స్, జీసీసీ జంక్షన్ వద్ద డైవర్షన్లు తీసుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం సమత హాస్టల్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవచ్చు.
ప్రజా రవాణా
ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు జగదాంబ జంక్షన్ లేదా జీసీసీ జంక్షన్ వద్ద దిగి, కాలినడకన నావల్ కోస్టల్ బ్యాటరీ మార్గంలో బీచ్‌లోకి వెళ్లాలి.
హోల్డింగ్ ప్రదేశాలు
బీచ్‌లో గ్యాలరీలు నిండిన అనంతరం ప్రజలను ఈ నాలుగు హోల్డింగ్ ఏరియాల్లో నిలిపి పెద్ద స్క్రీన్ల ద్వారా నేవీ విన్యాసాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
AU సమత హాస్టల్
MGM గ్రౌండ్
గురజాడ కళాక్షేత్రం
సెంట్రల్ పార్క్
అధికారుల వాహనాలు
పోలీస్, రెవెన్యూ, జివిఎంసి తదితర శాఖల అధికారుల వాహనాలు ఏఐఆర్ సమీప పార్కింగ్, సీ పెర్ల్ పార్కింగ్, వాల్తేర్ క్లబ్ లోపల పార్కింగ్‌లో నిలిపివేయాలి.
స్థానిక నివాసితులకు ప్రత్యేక సూచనలు
నావల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్‌లో నివసించే వారు పోలీసులకు సహకరించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆధార్ కార్డు చూపించి, పరిస్థితులను బట్టి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
అంబులెన్సులు – VIP ఎస్కార్ట్స్
రుషికొండ, ఎంవీపీ, కురుపాం సర్కిల్ నుంచి వచ్చే అంబులెన్సులు, VIP ఎస్కార్ట్స్ పార్క్ హోటల్ వద్ద డైవర్షన్ తీసుకొని చిన్నవాల్తేరు – సిరిపురం మార్గంలో వెళ్లాలి.
భారీ వాహనాలపై ఆంక్షలు (17–19 ఫిబ్రవరి)
ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు కాన్వెంట్ జంక్షన్ – షీలానగర్ – సింధియా మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. వాహనాలు లారీ యార్డుల్లోనే నిలిపివేయాలి. ద్విచక్ర, ఫోర్ వీలర్లు కాన్వెంట్ జంక్షన్ నుంచి ఊర్వశి – ఎన్ఏడి మార్గంలో వెళ్లాలి.
అదేవిధంగా నావల్ ప్రాంతానికి సమీపంలోని ఐఎన్‌ఎస్ శాతవాహన, కృష్ణ, కాకతీయ గేట్ల వద్ద డాక్‌యార్డ్ ఉద్యోగుల వాహనాలకు కూడా పార్కింగ్ అనుమతి ఉండదు.
నగర ప్రజలు సూచించిన మార్గాలను పాటించి, పోలీసులకు పూర్తి సహకారం అందించి ఈ అంతర్జాతీయ నౌకాదళ వేడుకలను విజయవంతం చేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
-
Politics1 week agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
Police News4 weeks agoఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్‌లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం
-
News4 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
News3 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
News3 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Telangana2 weeks agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
Police News2 days agoBBMA POLICE E:NEWS పోలీసుల్లో నూతనోత్సాహం.. క్రీడల కోలాహలం
-
Police News14 hours agoBBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత
